అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు (సామర్ధ్యమును మరియు బలమును) శక్తినొందెదరు గనుక మీరు …… భూదిగంతముల వరకును మీరు నాకు సాక్ష్యులై యుందురు. —అపోస్తలుల కార్యములు 1:8
నేను తిరిగి జన్మించిన క్రైస్తావురాలిగా సంఘ జీవితములో చాలా ఉత్తేజముగా పనిచేస్తున్నప్పటికీ, నా సమస్యల మీద విజయాన్ని పొందుకొనుట లేదని నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నేను ఒక క్రైస్తవుడుగా నటిస్తున్నట్లైతే మరియు అలా కనపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉంటానని అనుకునే దానిని. కానీ సరియైన పనులు చేయుట మాత్రమే చాలదు; నాకు అంతరంగములో మార్పు అవసరము.
అపోస్తలుల కార్యములు 1:8 లో ఆయన సాక్ష్యులుగా దేవుని శక్తిని పొందుకొనుటను గురించి మాట్లాడుతుంది. ఇది సాక్ష్యమును చేయమని కాకుండా సాక్ష్యులుగా జీవించమని చెప్తుంది. నా బహిరంగ జీవితము అందముగా కనిపించవచ్చు కానీ నా అంతరంగ జీవితము ఒక గందరగోళముగా ఉన్నది. చాలా తరచుగా అంతరంగా సంక్షోభం బ్రద్దలైంది మరియు నేను కనపడుచున్నట్లుగా అంతరంగములో లేనని ప్రతి ఒక్కరు చూడటం మొదలు పెట్టారు.
కృతజ్ఞతా పూర్వకముగా, నేను నా జీవితములో దేవుని ఆత్మ కదిలింపునకు ఆశించే సమయమునకు వచ్చియుండగా మరియు నేను ఆయనతో కలిగియున్న సంబంధములో నేను పొందిన అనుభవము కంటే గొప్పదని నేను గ్రహించి యున్నాను. నేను సహాయము కొరకు ప్రార్ధనలో ఆయన వద్ద వేడుకొనుచుండగా ఆయన నా జీవితమును ఒక శక్తివంతమైన మార్గముగా తాకి యున్నాడు మరియు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు దేవుని కొరకు మరియు ఆయన వాక్యము కొరకు మునుపు లేనంతగా నిజమైన ప్రేమను నాకు అనుగ్రహించి యున్నాడు. ఇప్పుడు మరి ఇక నేను ఎంత మాత్రమును నకిలి కాదు.
మీరు ఇదే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనవలేనని నేను ప్రోత్సహిస్తున్నాను. చేయుట నుండి మిమ్మును ఉండుట వరకు నడిపించుటకు అనుమతించండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మ, నేను చేయుట నుండి ఉండుట వరకు నడచునట్లు మీ శక్తిని నాకు ప్రసాదించుము. నేనెంత ప్రధానుడనైయున్ననూ నేను నిన్ను ప్రేమించాలని మరియు అనుసరించాలని ఆశిస్తున్నాను.