రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. – మత్తయి 6:34
అనేకమంది ప్రజల వలెనే, నేను ఇష్టపడని విషయాలను నేను వ్యతిరేకిస్తాను ఎందుకంటే దానితో నేనేమీ చేయలేను. ఒకరోజు దేవుడు నాతో ఇలా చెప్పాడు, “జాయిస్ నీ జీవితమును అనుభవించుము”.
ఇది మనందరికీ ఒక పాఠముగా అని నమ్ముచున్నాను. దేవుడు నాతో చెప్పునదేమనగా మనము నిగ్రహించలేని విషయాల కొరకు పోరాడవద్దని చెప్పాడు.
ఒకవేళ మనము ప్రయాణం చేస్తుంటే హఠాత్తుగా భయంకరమైన ట్రాఫిక్ వల్ల లేక ఏదైనా రోడ్డు ప్రమాదం వలన లేక ప్రతికూల వాతావరణం ద్వారానైనా మనకు ఇబ్బంది కలిగినటైతే దానిని ఎదిరించుట వలన ఏ ఉపయోగము లేదు. దేవుని అసాధారణ శక్తి మాత్రమే పరిస్థితిని మారుస్తుంది. నెమ్మదిగా కూర్చుని, ఆ సమయంలో ఆనందించుటకు కొంత సమయం తీసుకోని వేరే దారి వెదక వచ్చు కదా?
మన జీవితము సాగుతుండగా దానిలో జీవించుటకు దేవుడు మనకు తర్ఫీదునిచ్చాడు, అందువలనే ఆయన మనలను ఈరోజు మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు. మనము నిగ్రహించలేని విషయాలను చింతించుటను గురించి మనము సమయాన్ని వెచ్చిస్తున్నట్లైతే మనము అలసిపోయి విసిగిపోతామని ఆయనకు తెలుసు.
మీరు నిగ్రహించలేని విషయాలను మార్చుటకు ప్రయత్నించుట వల్ల మీ సమయాన్ని వృధా చేసుకోనవసరంలేదు. మీ ఎదుట దేవుడు ఉంచిన దానిని చేయుటకు మీ మనస్సును సరి చేసుకోండి మరియు మిగిలిన దానిని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను అన్నిటిని నిగ్రహించలేనని నాకు తెలుసు, కానీ నేను నీయందు నమ్మిక యుంచి యున్నాను. ఇప్పుడే, నీవు నాకు ఇచ్చిన దానిని ఉత్తమముగా ఒక నిర్ణయము తీసుకొనియున్నాను మరియు మిగిలిన దానిని మీకు అప్పగించుకొనుచున్నాను.