జ్ఞానమును ఎలా పొందాలి

నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. (సామెతలు 1:23)

దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ప్రార్థించాలి మరియు ఆయన నడిపింపుకు లోబడాలి. విధేయత అనేది మనకు అప్పుడప్పుడు జరిగే సంఘటన కాదు; అది మన జీవన విధానం. ప్రతిరోజూ దేవునికి విధేయత చూపడానికి ఇష్టపడే వ్యక్తులకు మరియు సమస్యల నుండి బయటపడటానికి మాత్రమే కట్టుబడి ఉండటానికి ఇష్టపడే వ్యక్తులకు మధ్య చాలా తేడా ఉంది. కష్టాల నుండి ఎలా బయటపడాలో దేవుడు ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తాడు, అయితే తన కోసం హృదయపూర్వకంగా జీవించాలని నిర్ణయించుకునే వారికి మరియు తనకు విధేయతను వారి జీవనశైలిగా మార్చుకునే వారికి ఆయన సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇస్తాడు. నిజమైన శాంతికి ఏకైక మార్గం దేవునికి విధేయత.

చాలా మంది ప్రజలు పెద్ద సమస్యలలో దేవునికి విధేయత చూపుతారు, కానీ చిన్న విషయాలలో విధేయత వారి జీవితాల కోసం ఆయన ప్రణాళికలో తేడాను కలిగిస్తుందని వారికి తెలియదు. మనం చిన్న విషయాలలో నమ్మకంగా ఉండకపోతే, ఎక్కువ విషయాలపై మనం ఎన్నటికీ పాలకులుగా ఉండలేమని బైబిల్ స్పష్టంగా చెబుతోంది (లూకా 19:17 చూడండి). దేవుడు మనల్ని చేయమని కోరిన చిన్న చిన్న పనులను చేయడానికి మనం నమ్మకంగా ఉండకపోతే, పెద్ద బాధ్యతతో మనపై నమ్మకం ఉంచడానికి దేవుడు ఎటువంటి కారణం లేదు.

చిన్న చిన్న విషయాలలో కూడా దేవునికి విధేయత చూపాలని నేను మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. బ్రదర్ లారెన్స్ అని పిలువబడే పదహారవ శతాబ్దపు సాధువు దేవుని సన్నిధిలో నిరంతరం నడచుటలో ప్రసిద్ధి చెందాడు. దేవునికి విధేయత చూపుతూ, ఆయనను ప్రేమిస్తున్నందున నేల నుండి గడ్డి ముక్కను తీయడం తనకు సంతోషంగా ఉందని అతను చెప్పాడు.

నేటి వచనంలో, దేవుడు మనలను సరిదిద్దినప్పుడు మనం ఆయన మాటలను వింటే ఆయన తన మాటలను మనకు తెలియజేస్తాడని చెప్పాడు. మనం ఆయన మార్గనిర్దేశాన్ని అనుసరిస్తే మరియు ఆయన మన నుండి అడిగే ప్రతి చిన్న పనిని చేయడానికి సంతోషిస్తే, అప్పుడు ఆయన తన జ్ఞానాన్ని మనకు తెరుస్తాడు మరియు మనం ఊహించిన దానికంటే ఎక్కువ బహిరంగముచేయబడుతుంది.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు కొంచెములో నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను గొప్ప విషయాలపై అధిపతిగా చేస్తాడు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon