
జ్ఞానము… త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది లుచుచున్నది గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. —సామెతలు 8:2-3
మీ జీవితము ద్వారా మన ప్రయాణ మార్గములో, మనము అనేక నిర్ణయములు తీసుకొనవలెను మరియు మనము వాటిని ఉద్రేకపూర్వకముగా లేక మనము దేనిని ఆలోచిస్తున్నామో లేక కోరుకుంటున్నామో దానిని చేస్తున్నట్లయితే మనము ఎల్లప్పుడూ సమస్యల్లో పడతాము.
మనము జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకొనవలెనని దేవుడు కోరుతున్నాడు. జ్ఞానమును కలిగి యుండుట అనగా తరువాత సంతోషముగా ఉండునట్లు ఎంపిక చేసుకొనుటయని నేను నమ్ముతున్నాను.
జ్ఞానము ఘోషించుచున్నదియని సామెతలు మనకు తెలుపుతున్నాయి. ఈరోజు మనము తీసుకొనిన నిర్ణయములు రేపటిని ప్రభావితం చేస్తాయని గుర్తించి మనము దేవుని జ్ఞానములో నడవవలెను. అనేక మంది ప్రజలు తమ జీవితాలలో ఆనందించరు ఎందుకంటే జ్ఞాన లేమితో వచ్చిన ఫలితములతో ఎల్లప్పుడూ వ్యవహరిస్తూ ఉంటారు.
జీవితములో గొప్ప అద్భుతాలు జరుగుతాయని స్వార్ధపరమైన పనులు మరియు జూదముతో వ్యవహరిస్తారు. జ్ఞానమనగా జూదము కాదు; అది భవిష్యత్తుకు పెట్టుబడి పెడుతుంది. జ్ఞాన తక్షణ సంతృప్తి కోసం స్థిరపడదు. బదులుగా, ఉత్తమమైన రేపటి కోసం అది దేవునిని అనుసరిస్తుంది.
కాబట్టి నీ గురించి ఏమిటి? నీవు ఈరోజు జ్ఞానములో నడుస్తున్నావా? నీవు అలా నడవని యెడల ఒక శుభవార్త ఏదనగా జ్ఞానము ఇప్పటికే కేకలు వేయుచున్నది. దేవుడు మీకు జ్ఞానము నందించుటకు ఇప్పటికే సిద్ధముగా ఉన్నాడు. కేవలం దాని కొరకు అడగండి మరియు దైవిక భవిష్యత్తులో పెట్టుబడి పెట్టే నిర్ణయాలు తీసుకొనుము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను జ్ఞాన లేమికి ఫలితంగా వచ్చే సమస్యలను స్థిరముగా శుభ్రం చేయుట కాక, నా జీవితములో ఆనందించాలని ఆశిస్తున్నాను. నాకు నీ జ్ఞానమును ఇచ్చినందుకు వందనములు. నేను దానిని పొందుకోవాలని ఆశిస్తున్నాను మరియు నా భవిష్యత్తు కొరకు దైవిక నిర్ణయములు తీసుకోవాలని ఎంపిక చేసుకొని యున్నాను.