నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు. (కీర్తనలు 119:165)
దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిస్థితుల ద్వారా నడిపిస్తాడనే వాస్తవం గురించి నేను ఈ అనుదిన ధ్యానములలో చాలాసార్లు వ్రాసాను. ఇది ఖచ్చితంగా నిజమే, అయితే పరిస్థితుల ద్వారా ఆయన స్వరాన్ని వినడానికి మరియు పాటించడానికి మనం ప్రయత్నించినప్పుడు మనం సమతుల్యంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గుర్తించడానికి పరిస్థితులను మాత్రమే ఉపయోగించమని నేను సిఫార్సు చేయను. ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన సమాధానము మరియు జ్ఞానమును కూడా మనం పరిగణించాలి. ఇవి మనం దేవుని నుండి వినే ప్రధాన మార్గాలు, వాటిని మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ఒక పరిస్థితి తెరిచిన తలుపులా కనిపించవచ్చు, కానీ మనకు సమాధానము ఉంటే తప్ప మనం ద్వారము గుండా వెళ్ళకూడదు.
పరిస్థితులను అనుసరించడం అనేది మనల్ని వాస్తవమైన సమస్యల లోనికి నడిపించవచ్చు. సాతాను కూడా దేవుడు చేయగలిగిన విధంగా పరిస్థితులను ఏర్పాటు చేయగలడు, ఎందుకంటే మనం జీవిస్తున్న సహజ పరిధిలో ఆయనకు ప్రవేశం ఉంది. కాబట్టి, మనం దేవుని నుండి విన్న ఇతర మార్గాలను పరిగణనలోకి తీసుకోకుండా, పరిస్థితులను మాత్రమే అనుసరిస్తే, మనం మోసంలో పడవచ్చు.
మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళలేమని మనకు తెలుసు. మనం సమాధానముతో నడిపించబడాలి మరియు వివేకముతో నడవాలి. పరిస్థితులు మనల్ని నడిపించడానికి అనుమతించే ముందు మన హృదయాలలో సమాధాన స్థాయిని పరీక్షించడానికి తక్షణ “అంతరంగ తనిఖీ” చేయడం సులభం. దేవుని నుండి వినడానికి సురక్షితమైన మార్గం ఏదనగా, ఆత్మ ద్వారా నడిపించబడే లేఖన పరమైన పద్ధతులను మరియు వాటిని ఒకదానికొకటి తనిఖీలు మరియు బ్యాలెన్స్‌లుగా అందించడాన్ని కలపడం. దేవుని వాక్యంలోని సంపూర్ణ ఉపదేశాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం మరియు మీరు కోరుకున్న దానితో ఏకీభవించే భాగాలను కనుగొనడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: నిర్ణయములు తీసుకునేటప్పుడు ఎల్లప్పుడు సమాధానమును వెంటాడుడి.