
ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను. —దానియేలు 6:3
శ్రేష్టమైన ఆత్మను కలిగియున్న వ్యక్తిగా దానియేలును గురించి బైబిల్ లో వివరించబడి యున్నది. అతడు ఎటువంటి పరిస్థితిలోనైనా అతని జీవితముతో దేవునిని మహిమపరచాడు.
దానియేలు దేవునిని ప్రేమించాడు మరియు ఆయనను సేవించుటలో ఏమాత్రమూ వెనుకాడలేదు. ఫలితముగా, దేవుడు రాజు యొక్క దయను అనుగ్రహించాడు తద్వారా ఆ దేశములోని ఇతర నాయకులందరి కంటే ఉన్నత స్థానమును పొందుకున్నాడు. కానీ దేవుని యెడల అతడు కలిగియున్నా సమర్పణ పరీక్షించబడినది.
రాజు దానియేలు యెడల దయ చూపుట నాయకులకు ఇష్టం లేదు. కాబట్టి 30 రోజుల వరకు రాజునూ తప్ప ఏ దేవునిని ఎవరూ పూజింపకూడదని ప్రార్ధన చేయకూడదనే నిషేదాజ్ఞ మీద రాజు వద్ద సంతకం తీసుకున్నారు. ఎవరైనా రాజాజ్ఞను తిరస్కరించిన యెడల వారు సింహముల గుహలోనికి త్రోయబడుదురని చెప్పబడింది.
దానియేలు రాజాజ్ఞకు భయపడలేదు – కానీ అతడు దేవుని సన్నిధిలో చేసిన సమర్పణ యెడల బాధ్యతను కలిగి యున్నాడు. మీకు ఈ కధ తెలిసియున్నట్లైతే, దేవుడు అతనిని కాపాడాడని మరియు ముగింపులో దేవుడు మహిమ పరచబడ్డాడని చూస్తున్నాము.
మీరు అదే శ్రేష్టత కలిగిన ఆత్మతో జీవించాలని ప్రోత్సహిస్తున్నాను. మీ జీవితములోని ప్రతి పరిస్థితిలో మీరు దేవుని కొరకు జీవించుటకు నిర్ణయించుకోండి. మీరు దీనిని చేయుచుండగా, మీరు మీ నిజమైన ప్రణాళికను నెరవేర్చగలరు మరియు దానియేలు వలె మీరు చేసే ప్రతి పనిలో దేవునిని మహిమ పరచగలరు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను కేవలం దానియేలు వలే శ్రేష్టతయనే జీవితమునకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. నాలో శ్రేష్టమైన ఆత్మను నింపుము తద్వారా నేను చేసే పనులన్నిటిలో మిమ్మును సేవించగలను.