తెల్లవారకమునుపే (చిన్నబిడ్డను పోలిన ప్రార్ధనతో) మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను. —కీర్తనలు 119:147
మీ దినమును మీరెలా ప్రారంభిస్తారు? మీరు ఆత్రుతగా లేచి త్వరత్వరగా బయటికి వెళ్తారా? మీరు టి.వి పెడతారా? వ్యాయామం చేస్తారా? మీరు ఉదయకాలపు వేలపట్టిక ఏదైనప్పటికీ మిమ్మల్ని మీరు అడిగే మొదటి ప్రశ్న ఎదనగా నేను నా దినమును ప్రారంభించినప్పుడు దేవుని పోషించే పాత్ర ఏది?
దీనిని అర్ధం చేసుకొనుటకు నాకు చాల సంవత్సరములు పట్టింది కానీ నా దినమును ప్రారంభించుటకు చాలా ఉత్తమ మార్గము ఎదనగా దేవుడు నా కొరకు చేసిన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే మరియు నేను ఇతరులకు ఎలా ఆశీర్వాదకరముగా ఉండాలో అని దేవునిని అడుగుట.
దేవుడు మీ జీవితములో చేసిన గొప్ప కార్యముల మీద దృష్టిని నిలుపుటలో సమయాన్ని గడుపుటకు నేను ప్రోత్సహిసున్నాను. ఆయన మిమ్ములను తోడుకొని వచ్చిన అపాయములు మరియు కష్టములను గురించి మరియు ఆయన మిమ్మును స్వస్థ పరచిన మరియు మార్చిన విధానమును ఆలోచించండి మరియు ఆయన మిమ్మును గురించి శ్రద్ధ తీసుకొనుటను గురించి మరియు మీ ప్రార్ధనలు ఆలకించుటను గురించి తెలుసుకొనుట ఎంత మంచిదో ఆలోచించండి.
మీరు ప్రతి ఉదయం మీ మనస్సును దేవుని మీద ఉంచినప్పుడు, మీ మిగిలిన దినములో ముందుకు సాగుచుండగా మీరు ఆయన కొరకు జీవించునట్లు మీకు సమస్త సమాధానము మరియు ఆనందమును అనుగ్రహించును.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను ప్రతి ఉదయ కాలమున మేల్కొనినప్పుడు మిమ్మును వెదకుటకు నేను ఒక నిర్ణయమును తీసుకొని యున్నాను. మిమ్మును వెదకి మీ సమాధానమును మరియు ఆనందమును పొందుకొనుట కంటే నాకేదియు ప్రాముఖ్యమైనది కాదు.