సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు (క్రీస్తుతో మీ సహవాసము మరియు ఐక్యతతో) నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. —1 కొరింథీ 15:31
స్వార్ధము అనునది నేర్చుకొనిన స్వభావము కాదు – మనము దానితోనే జన్మించి యున్నాము. కాని యేసును మన స్వంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన మన ఆత్మలో నివసించుటకు వచ్చును మరియు మనము అనుదినము ఎలా చనిపోవాలో మనము నేర్చుకుంటాము మరియు పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరిస్తూ అప్పుడు మనము స్వార్ధమును జయించగలము. అది పూర్తిగా మననుండి విడిచి వెళ్ళదు, కానీ దానిని అనుదినము జయించుటకు మనలో నివసిస్తున్న గొప్పవాడు మనకు సహాయం చేయును. (గలతీ 5:16 చుడండి).
ఇప్పుడు, నేను స్వార్ధమును పూర్తిగా జయించలేదు, మరియు మనలో ఏ ఒక్కరూ దానిని జయిస్తారని నేను సందేహిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కుడా, గొప్ప క్రైస్తవుడుగా జీవించినప్పటికీ స్వార్ధమును జయించుటకు సమస్యను ఎదుర్కొన్నాడు. ప్రతి ఒక్కరి లాగానే స్వార్ధ రహితముగా జీవించుటను నేర్చుకొనుట అతని ప్రయాణమై యున్నది. అతడు అనుదినము చనిపోవలసి యున్నదని అతనితో అతడు చెప్పుకున్నాడు.
మనము కూడా అదే జీవితమునకు పిలువబడ్డాము ఎందుకనగా మనము స్వార్ధపూరితమైన జీవితములు జీవించుచు మార్పును కలిగించాలని ఆశించలేము. మనము ప్రతిదినము చనిపోతూ ఉండాలి. దీనిని చేయుట సాధారణముగా సులభము కాదు, కానీ దేవుని మీద మనము ఆధారపడి యున్నప్పుడు సరియైన దానిని చేయుటకు దేవుడు మనకు ఎల్లప్పుడూ తన కృపను అనుగ్రహించును. సత్యమేదనగా, స్వార్ధము లేని జీవితమును జీవించుట అనునది అధిక నీతి, సమాధానము మరియు ఆనందమును ప్రతిరోజూ కలిగి యుండుటకు ఉత్తమ మార్గమై యున్నది!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను పరిపూర్ణుడను కాను, కానీ నేను అనుదినము చనిపోవుటకు మీరు నాకిచ్చిన బలము ద్వారానే దీనిని చేయగలుగుతున్నాను. మీరు నా ద్వారా మీ జీవితమును జీవించుటకు స్వార్ధమును ఎలా జయించాలో నాకు చూపించుము.