యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. (కీర్తనలు 37:4)
మన హృదయాల్లో పరిశుద్ధమైన కోరికలుండుట అనేది దేవుడు మనతో మాట్లాడుటకు ఒక మార్గమై యున్నది. నాకు ఇంట్లో గుమ్మడికాయ రొట్టె తినాలని కోరిక ఉన్నప్పటికీ, దానిని తయారు చేయడానికి ప్రతిభ లేదు, తయారు చేయుటకు సమయం లేదని నాకు గుర్తుంది. నేను కేవలం, “ప్రభువా, నేను ఖచ్చితంగా తాజా గుమ్మడికాయ రొట్టెలను ఇష్టపడతాను” అని చెప్పాను మరియు దాని గురించి మళ్లీ ఆలోచించలేదు. దాదాపు ఒక వారం తరువాత, నా కోరిక గురించి ఏమీ తెలియని ఒక మహిళ నాకు ఒక పెట్టెను అందించింది మరియు నేను దానిని తెరిచినప్పుడు, ఇంట్లో తయారుచేసిన గుమ్మడికాయ రొట్టె దొరికింది. దేవుడు మన కోసం చిన్న మరియు పెద్ద పనులను చేయడంలో సంతోషిస్తాడు మరియు మనం వాటన్నింటిని మెచ్చుకోవడంలో ఎప్పుడూ విఫలం కాకూడదు.
మనకు పరిశుద్ధమైన లేదా పవిత్రమైన కోరికలను అనుగ్రహించమని మనం దేవునిని అడగాలి. మనకు సాధారణంగా విజయం, ఆర్థిక పరిస్థితులు, మంచి గృహాలు మరియు మంచి సంబంధాలు వంటి సహజమైన వాటి కోసం కోరికలుంటాయి కానీ మనం ఆధ్యాత్మిక విషయాలను కూడా కోరుకోవాలి. మనం దేవునిని లోతుగా మరియు మరింత సన్నిహితంగా తెలుసుకోవాలని, ఎల్లప్పుడూ ఆత్మ ఫలాన్ని, ముఖ్యంగా ప్రేమను ప్రదర్శించాలని, ఆయనను మహిమపరిచే మార్గాల్లో దేవుణ్ణి సేవించాలని, ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపాలని కోరుకోవాలి. శరీర సంబంధమైన కోరికలను తొలగించి, పవిత్రమైన కోరికను ఇవ్వమని దేవుణ్ణి వేడుకుందాం.
దేవుడు మీరు నీతి, సమాధానము మరియు ఆనందమును పొందునట్లు మీ జీవితాల్లో ఆయన కోరికలను పెట్టును (రోమీయులకు 14:17 చూడండి), మరియు అవి ఎన్నడూ దేవుని వాక్యముతో అసమ్మతిగా ఉండవు. తప్పుడు కోరికలు మనలను వేధిస్తాయి మరియు వాటిని స్వీకరించడం పట్ల మనం అసహనంతో ఉంటాము, కానీ పవిత్రమైన కోరిక దేవుని మార్గాలు మరియు సమయం కోసం వేచి ఉండాలనే సముఖతతో వస్తుంది.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ కోరికలను దేవుని యెదుట పెట్టండి, వాటిని గురించి ప్రార్ధించండి మరియు అవి మీకు యధార్ధమని మీకు అనిపించినప్పుడు వాటిని దేవుని యెదుట పెట్టి ఆయన మీకు వాటిని అనుగ్రహించునని నమ్మండి.