నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన (వాడను) నేనే. (యెషయా 63:1)
ఈరోజు వచనములో దేవుడు మీతో మాట్లాడతాడనీ, మరియు ఆయన దానిని చేసినప్పుడు ఆయన నీతిని మాట్లాడతాడని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆయన సరైనది అని చెప్పేదానిపై మనం ఎల్లప్పుడూ ఆధారపడవచ్చు. దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు కానీ వాటికే పరిమితం కాకుండా: ఆయన వాక్యం, స్వభావం, వ్యక్తులు, పరిస్థితులు, సమాధానము, జ్ఞానం, అసాధారణ జోక్యం, కలలు, దర్శనాలు మరియు కొందరు “అంతర్గత సాక్షి” అని పిలుస్తుంటారు. మన హృదయాలలో ఆయనను లోతుగా “తెలుసుకోవడం”. ఆయన “మెల్లని, చిన్న స్వరం” అని బైబిల్లో పిలిచే దానితో కూడా మాట్లాడతాడు, ఇది అంతర్గత సాక్షిని కూడా సూచిస్తుందని నేను నమ్ముతున్నాను.
దేవుడు కొన్నిసార్లు మనస్సాక్షి ద్వారా, మన వాంఛల ద్వారా, మరియు వినపడే స్వరము ద్వారా మాట్లాడతాడు, కానీ ఎల్లప్పుడూ ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన చెప్పేది ఎల్లప్పుడూ సరైనదని మరియు అది ఆయన వ్రాసిన వాక్యంతో ఎప్పుడూ విభేదించదని గుర్తుంచుకోండి. మనం దేవుని వినగల స్వరాన్ని చాలా అరుదుగా వింటాము, అయితే అది జరుగుతుంది. నా జీవిత కాలంలో మూడు నాలుగుసార్లు ఆయన స్వరం వినసొంపుగా వినిపించాడు. ఈ రెండు సందర్భాలలో, నేను నిద్రపోతున్నాను మరియు ఆయన స్వరం నా పేరును పిలవడం ద్వారా నన్ను మేల్కొల్పింది. నేను విన్నదంతా “జాయిస్” అని కానీ దేవుడు మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. ఆయన తనకు ఏమి కావాలో చెప్పలేదు, కానీ చాలా సంవత్సరాలుగా ఆ విషయంలో స్పష్టత రాకపోయినప్పటికీ, ఆయన కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయమని ఆయన నన్ను పిలుస్తున్నాడని నాకు సహజంగా తెలుసు.
దేవుడు ఏ మార్గములోనైతే మీతో మాట్లాడుటకు ఎన్నుకుంటాడో దానిని వినుటకు దేవుడు మీకు సహాయం చేయునట్లు దేవుణ్ణి అడగమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు; ఆయన మీ కొరకు మంచి ప్రణాళికలను కలిగి యున్నాడు; మరియు ఈ విషయాలను గురించి దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడు అనేక మార్గాల్లో మాట్లాడతాడు; గుర్తుంచుకోండి – ఆయన బైబిల్‌కు ఎప్పటికీ విరుద్ధంగా ఉండడు.