విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు (ఖచ్చితముగా) నమ్మవలెను గదా. —హెబ్రీ 11:6
నేను నా బాల్యమంతటిలో చాలా భయంకరముగా దుర్వినియోగపరచబడ్డాను. నా జీవితము చాలా భయంకరముగా గడిచింది. నాకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు నా జీవితములో నవ్వు అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా మనస్సు చాల గందరగోళముగా ఉండేది, నా ఉద్రేకములు చాల గందరగోళముగా ఉండేవి… సమస్తము చాలా గందర గోళముగా ఉండేది!
కానీ నేను ఆ విధముగా ఉండలేదు గనుక దేవునికి వందనములు! దేవుడు నాతో వ్యవహరించి నన్ను మార్చాడు మరియు వాటన్నింటిలోనుండి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేను దేవునితో గొప్ప సంబంధమును కలిగి యున్నాను, నా కుటుంబము, స్నేహితులు మరియు ఇతరులతో నిజమైన సమాధానము, ఆనందము మరియు మంచి సంబంధములను కలిగి యున్నాను మరియు దేవుడు నన్ను దేనికైతే పిలిచి యున్నాడో దానినే నేను చేయుచున్నాను.
హెబ్రీ 11:6 మనకు తెలియజేయుచున్నదేమనగా ఎవరైతే దేవునిని విడువక వెదకుతారో వారికి దేవుడు బహుమానము నిచ్చును. నేను దేవునికి సన్నిహితముగా ఉండుటకు మరియు ఆయనకు విధేయత చూపుటకు నేను దేనినైనా త్యాగము చేస్తే దానిని తిరిగి అనేక రెట్లు ఆయన నుండి పొందుతాను. మరియు ఆయన నాకిచ్చినదేదైనా నాకు ఉత్తమమైనదే.
జాయిస్, నేను ఎటువంటి పరిస్థితులలో గుండా వెళ్తున్నానో నీకు తెలియదు అని మీరు అనుకోవచ్చు. ఇది చాల కష్టమైనది!
నేను కుడా చాలా కఠిన పరిస్థితుల గుండా వెళ్ళాను – గనుక నేను అర్ధం చేసుకోగలను. మీ కష్ట పరిస్థితుల మధ్యలో ఆయనను వెదకుటకు నిర్ణయించుకోండి. మీ గందర గోళములను తీసివేయుటకు ఆయన మరింతగా చాలినవాడై యున్నాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు నా గందరగోళములను శుభ్రపరచుటకు సమర్ధుడని నేను నమ్ముచున్నాను. నేను నా సమస్యలలో ఇరుక్కుపోయి యుండుట కంటే నేను విడువక నిన్ను వెదకుదును మరియు నాలో ఒక మంచిని చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను.