దేవుడు ఎవరిని వాడుకుంటాడు?

దేవుడు ఎవరిని వాడుకుంటాడు?

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.  —1 కొరింథీ 1:27

దేవుడు నన్ను తన నోటికి బూరగా ఆయన వాక్యమును బోధించుటకు ఎన్నుకున్నాడు. దేవుడు నా జీవిత గమ్యములోని ఒక భాగమైన – తన కొరకు నన్ను మాట్లాడుటకు ఆయన నన్ను అభిషేకించెను గనుక ప్రజలు నా మాటలు వింటారు. ఆయన ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వారిని దేవుడు అభిషేకిస్తాడు కాబట్టి అందులో మీరు కూడా ఒకరు కావచ్చు.

దేవుడెవరిని ఉపయోగించుకుంటాడు?  దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడని బైబిల్ చెప్తుంది. ఆయన నీ వంటి మరియు నా వంటి సాధారణ ప్రజలను ఉపయోగించుకుంటాడు.

నేను సువార్త ప్రకటించుట ప్రారంభించినప్పుడు, నా స్నేహితులలో కొందరు తృణీకరించారు – నేను స్త్రీని కనుక దానిని చేయకూడదని వారు ఆలోచించారు. వాస్తవముగా నేను దానిని చేయలేనని వారు నాతో చెప్పారు.

కానీ దేవుడు దానిని చేయమని నాతో చెప్పాడు కనుక నేను దీనిని చేయుచున్నాను. అదే మీ విషయంలో కూడా జరుగుతుంది. దేవుడు మీ హృదయములో ఉంచిన లక్ష్యమును కలిగి యుండవలెనని ఆశించిన యెడల, దేవుడు మీ ద్వారా గొప్ప కార్యమును చేయగలడు!

ప్రతి సామాన్య వ్యక్తి దేవుని చేత గొప్పగా వాడబడతాడు. ఆయన మిమ్మును వాడుకుంటాడని మీరు నమ్మాలి మరియు దేవుడు మీ హృదయాల్లో ఉంచిన లక్ష్యములు మరియు దర్శనములు హత్తుకొనుటకు చాలినంత ధైర్యమును అనుగ్రహిస్తాడు. మీరు ఎన్నుకొనబడ్డారు!


ప్రారంభ ప్రార్థన

దేవా, నీవు నన్ను ఎన్నుకున్నావు గనుక, మీరు నా కొరకై కలిగి యున్న గమ్యమును గురించి నేను సందేహపడను. మీలో నాకు ఈ అవకాశమును ఇచ్చినందుకు వందనములు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon