మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. —ఆదికాండము 50:20
దేవుడు దీనిని కొద్దికాలము క్రితము నాతో మాట్లాడి యున్నాడు: జాయిస్, నీవు నీ ముక్కు కొనను చూడగలవు (అది ఎంతో దూరం లేదు), మరియు నీవేదైనా బాగుగా లేని యెడల అది మంచిది కాదు అని చెప్తావు. కానీ నేను ప్రారంభమునుండి ముగింపు వరకు చూస్తాను ఎందుకనగా నేను ఆదియు అంతమునై యున్నాను, మరియు నీకు తెలియని అనేక విషయాలను నేను ఎరిగి యున్నాను.
మనకు కొంత భాగమే తెలుసు… కానీ దేవునికి సమస్తము తెలుసు.
ఆదికాండము 50:20 లో యోసేపు తనను భయంకరముగా హింసించిన తన సహోదరులతో మాట్లాడుతున్నాడు. వారు అతని గుంతలోనికి త్రోసివేసి ఒక బానిసగా అమ్మి వేసినప్పుడు, వారు అతనికి వ్యతిరేకముగా పని చేస్తున్నారని అనుకున్నారు, కానీ నిజముగా దేవుడు ఈ శోధనలనే యోసేపును గొప్ప ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చుటకు వాడుకున్నాడు.
కొన్నిసార్లు మనము ఆలోచించే అనేక విషయాలు చాలా భయంకరముగా ఉంటాయి కానీ అవి మనకు గొప్ప ఆశీర్వదములుగా మార్చబడతాయి. ఈ గొప్ప శోధనలు మీలో గొప్ప విశ్వాసమును కలిగించవచ్చును. మీరు ఒక గుంట అడుగు భాగములో ఉండవచ్చు కానీ దేవుడు నీ జీవితములో కలిగియున్న అతని ప్రణాళికను నెరవేర్చుటకు ఆ గుంతనే వాడుకోవచ్చు. జ్ఞాపకముంచుకోండి, దేవుడు సమస్తమును చూడగలడు, మరియు ఆయన ఆ శోధనలను మీ మేలుకొరకు ఉపయోగించుకొనగలడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా ముక్కును దాటి నేను దేనినీ చూడలేనని నాకు తెలుసు, కానీ మీరు సమస్తమును చూడగలరని నాకు తెలుసు కాబట్టి నేను మీయందు విశ్వాసముంచుచున్నాను. మీరు నా శోధనలన్నిటిని మోసుకొని వాటి నుండి నాకు మేలులను దయచేయుదురని నేను నమ్ముచున్నాను.