ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. (కీర్తనలు 19:1)
దేవుడు ఎవరినుండీ దాగుకొనడు. ఆయన తనను తాను సమస్త మనవాళికి బయలుపరచుకునే దేవుడు (రోమీయులకు 1:19–20).
ఆయన తన చేతి పని ద్వారా ప్రతి ఒక్కరికీ తనను తాను బయలుపరచుకున్నాడు, మరియు ప్రకృతియే ఆయన శక్తిని మరియు ఉద్దేశ్యములను ప్రచుర పరచుచున్నది. చుట్టూ చూడండి మరియు దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని గమనించండి. ఆయన ప్రకృతి ద్వారా మనకు చెప్పే ప్రధాన విషయం ఏమిటంటే, అతను నిజంగా ఉనికిలో ఉన్నాడు. ఆయన ప్రతిరోజూ మనలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు ఆయన తన గురించి ప్రతిచోటా ఆధారాలను వదిలివేస్తాడు, “నేను ఇక్కడ ఉన్నాను! మీరు చింతించాల్సిన అవసరం లేదు లేదా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నాను.”
ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు మరియు సాయంత్రం అస్తమిస్తాడు. నక్షత్రాలు రాత్రిపూట ఆకాశములో మెరుస్తూ ఉంటాయి మరియు దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తు చేయునట్లు విశ్వం అలాగే ఉంటుంది.
చలికాలంలో కొన్ని చెట్లు పూర్తిగా చచ్చిపోయి, ప్రతి వసంతకాలంలో ఎలా తిరిగి జీవిస్తాయో మనం పరిశీలిస్తే, మన పరిస్థితుల కారణంగా మనం నిర్జీవంగా లేదా నిస్సహాయంగా భావించినప్పటికీ, దేవుడు మన జీవితాలను పూర్తిగా వికసించేలా చేస్తాడని మనం గుర్తు చేసుకుంటాము.
నేను కేవలం ఒక చెట్టును చూస్తూ, అది వీస్తున్న గాలిని చూస్తూ ఆనందిస్తాను. ఎండిపోయిన ఆకులు కొన్నిసార్లు కొమ్మలకు కాసేపు అతుక్కోవడం, ఆ తరువాత ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు అవి ఎగిరిపోవడాన్ని నేను గమనించాను, తద్వారా కొత్త మొగ్గలు పెరగడానికి మరియు వృద్ధి చెందడానికి స్థలం వస్తుంది. దేవుని ఆత్మయనే గాలి మన జీవితాలలో ఇకపై అవసరం లేని ప్రతిదాన్ని చెదరగొట్టడానికి నమ్మకమైనదని మరియు ఆయన మిగిలి ఉండవలసినవన్నీ రక్షిస్తాడని ఇది నాకు గుర్తుచేస్తుంది. ఆయన నూతన జీవితం మరియు ఎదుగుదల మరియు తాజా సమయాలను మనకు అనుగ్రహిస్తాడు.
దేవుడు ప్రకృతి ద్వారా ఎలా మాట్లాడతాడో ఈ ఉదాహరణలను గుర్తుంచుకోండి మరియు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లినా ఆయన ఆధారాల కోసం వెతకండి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ఈరోజు దేవుడు మీ కొరకు వదిలిపెట్టిన అనేక ఆధారాలలో ఒకదాని కోసం వెతకండి.