దేవుడు ద్వారములను మూయును మరియు తీయును

దేవుడు ద్వారములను మూయును మరియు తీయును

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా …  —ప్రకటన 3:7

మనము దేవుని నుండి స్పష్టముగా వింటున్నాము అని గ్రహించవలసి వచ్చినప్పుడు మన జీవితాల్లో కష్ట సమయాలను ఎదుర్కొంటాము. మన ఉద్రేకపరమైన కారణముల వలన ఆయన స్వరమును వినుట ఎల్లప్పుడూ సులభము కాదు. ఎవరు మూయలేని ద్వారములను దేవుడు తెరుస్తాడని మరియు మనము ఆయన మూసివేసిన ద్వారములను మనము తెరవలేమని నా అనుభవము నుండి నేను తెలుసుకున్నాను.

నా జీవితములో నేను చేయాలని ఆశించిన విషయాలు చేయుటకు నేను అనేక సంవత్సములు గడిపాను. ఫలితమేదనగా నిరాశ మరియు నిస్పృహ. కానీ మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు తన కృపను అనుగ్రహించి ఆయనను వెదకుటకు మరియు ఆయన పరిపూర్ణ సమయము కొరకు చూచుటకు ఆయన మన కార్యములు సులభము చేయును. ఆయన ఒక మెట్టు ఒకసారి ఎక్కునట్లు నడిపిస్తాడు. మీరు ఒక మెట్టును తప్పు దిశలో వేసిన యెడల మీరు ఎక్కువ దూరము వెళ్ళక ముందే ఆయన మీకు తెలియజేస్తాడు.

ఆయన ఉద్దేశ్యములు మీ ఉద్దేశముల కంటే ఉన్నతమైనవని తెలుసుకోండి. ఆయన ప్రారంభము నుండి అంతము వరకు ఆయన చూచును. ఆయన మార్గములన్నియు సరియైనవి మరియు ఖచ్చితమైనది. ఆయన మీ జీవితమునకు ఒక అర్ధమును కలిగించును మరియు దానిని జరుగునట్లు చూచుకొనును. ఆయన స్వరమును వినండి అప్పుడు మీరు మోసగించబడరు.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నా జీవితములో మంచి ద్వారములు తెరచి తప్పు ద్వారములను ముసివేసియున్నారని నేను నమ్ముతున్నాను. ఏమి చేయాలో నాకు తెలియనప్పటికీ, మీ నుండి నేను వినగలనని మరియు మీ చిత్తమును అనుసరించగలనని నేను విశ్వాసమును కలిగి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon