వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను (ఆయనను ఆరాధించే వారి మీద) నిలుచు చున్నది. (కీర్తనలు 33:18)
నేను దేవుని నుండి వినడానికి చాలా ప్రయత్నించినప్పుడు మరియు నేను తప్పు చేస్తానని చాలా భయపడిన సమయం నాకు గుర్తుంది. ఆ సమయంలో, నేను దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవడం ప్రారంభించాను. నేను క్రొత్తగా ఆత్మచేత నడిపించబడడం ప్రారంభించాను, మరియు నేను నిజంగా వింటున్నానా లేదా అని తెలుసుకోవడానికి దేవుని నుండి విన్నంత అనుభవం నాకు లేనందున నేను భయపడ్డాను. మన హృదయాలు సరిగ్గా ఉంటే దేవుడు మన తప్పులను విమోచిస్తాడని నాకు అర్థం కాలేదు.
ఆయన నాతో మాట్లాడుతున్నాడు మరియు విశ్వాసంతో నేను ముందుకు సాగునట్లు నాకు దేవుడు సహాయం చేయుచున్నాడు, కానీ నేను ఇలా అన్నాను, “ప్రభూవా, నేను నిన్ను కోల్పోతే? నేను నిజముగా ఏదైనా తప్పు చేస్తే లేక నీకు విధేయత చూపక పోతే ఏమి చేయాలి? అవును దేవా నేను నిన్ను కోల్పోతానని భయపడుతున్నాను!”
ఆయన నాతో మాట్లాడి, “జాయిస్, చింతించకు. మీరు నన్ను మిస్ అయితే (తప్పిపోతే), నేను నిన్ను కనుగొంటాను. ఆ మాటలు దేవుడు నన్ను ఏమి చేయమని పిలుస్తున్నాడో అది చేయగలిగే ధైర్యాన్ని ఇచ్చింది మరియు నా హృదయానికి గొప్ప నెమ్మదిని కలిగించింది. నేను వాటిని విన్నప్పటి నుండి చాలా సార్లు విశ్వాసంతో అడుగు పెట్టమని ఆ మాటలు నన్ను ప్రోత్సహించాయి. ప్రస్తుతం దేవుడు మీకు చెబుతున్న దానికి ప్రతిస్పందిస్తూ మీరు తీసుకోవలసిన విశ్వాసపు అడుగులు వేసేందుకు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈరోజు నేను వాటిని మీతో పంచుకుంటున్నాను.
మీరు మీ జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని కోరుకుంటే మరియు మీరు దేవుని నుండి వినడానికి మీకు తెలిసినదంతా చేసినట్లయితే, మీరు ఒక అవకాశాన్ని తీసుకోవాలి, అడుగు పెట్టాలి మరియు విశ్వసించాలి. మీరు తప్పు చేసినప్పటికీ, దేవుడు దానిని సరిదిద్దాడు మరియు మీ మేలు కోసం పని చేస్తాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు దేవుని నుండి ఏదైతే విన్నారో దానిని నమ్మండి మరియు ఆయనను మీరు కోల్పోతారేమోనని భయపడకండి.