
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. (కీర్తనలు 48:14)
మనం ఈ భూమిపై ఉన్నంత కాలం మనల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడని నమ్మడం ఓదార్పునిస్తుంది. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. ఆయన ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు.
మీరు దేవుని నుండి “వినే” సామర్థ్యాన్ని పెంపొందించుకున్నప్పుడు, ఆయన మాట్లాడే ప్రధాన మార్గాలలో దైవిక మార్గదర్శకత్వం ఒకటని మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో దేవునిని గుర్తించడం, ఆయన మార్గదర్శకత్వం కోసం అడగడం మరియు అది మీకు ఉందని విశ్వాసం ద్వారా విశ్వసించడం వంటి ఆధ్యాత్మిక అలవాటును ఏర్పరచుకోండి.
నేను ఈ రోజు తర్వాత (ఆలస్యముగా) షాపింగ్‌కి వెళుతున్నాను మరియు నన్ను నడిపించమని దేవుడిని అడుగుతాను. ఆయన నేను ఊహించని అమ్మకాలు వున్న చోటికి నన్ను నడిపించవచ్చు లేదా నేను బయట ఉన్నప్పుడు ఆయన నాకు ప్రోత్సాహం అవసరమైన వారిని కలిసే విధంగా నా మార్గాన్ని నడిపించవచ్చు. నా అడుగులు ప్రభువుచే ఆదేశించబడతాయని నేను విశ్వసిస్తున్నాను (కీర్తన 37:23 చూడండి). నేను కొనుక్కోవాల్సిన వాటి వైపు నన్ను నడిపిస్తాడని మరియు నాకు అవసరం లేని వస్తువులను కొనకుండా సహాయం చేస్తాడని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. నేను చేసే ప్రతి పనిలో ఆయన పాలుపంచుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను.
నా బోధనా పరిచర్యలో, నేను తరచుగా దైవిక మార్గదర్శకత్వాన్ని అనుభవిస్తాను. నేను చెప్పేదానిని నేను అధ్యయనం చేసి సిద్ధం చేస్తాను, కానీ తరచుగా నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు నేను అనుకున్నదానికంటే వేరే దిశలో దేవునిచే నడిపించబడుతున్నాను. హాజరైన వ్యక్తులు ఏమి వినాలో ఆయనకు తెలుసు మరియు ఆయనను నాయకత్వం వహించేలా చేయడం నా పని.
దేవుని నుండి వినడం చాలా సహజంగా అనిపించవచ్చు అని గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అసాధారణ అనుభవాలను వెతకకండి, బదులుగా దేవుని దైవిక మార్గదర్శకత్వం కోసం వెతకండి. ఆయన ఆత్మ మీలో ఉన్నాడు మరియు మీ అన్ని కార్యకలాపాలలో పాల్గొనడానికి ఆయన సంతోషిస్తాడు. ఈరోజు మీరు ఏమి చేసినా లేదా మీరు ఎక్కడికి వెళ్లినా, ఆయన మీకు మార్గనిర్దేశం చేస్తారని ఆశించండి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడెల్లప్పుడూ మీతో ఉంటాడు మరియు ఈరోజు సమస్తమును గురించి మీకు బోధిస్తాడు.