అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. (యెషయా 66:2)
మనం దేవుని నుండి విన్నప్పుడు, వినయం మరియు నమ్మకంతో ప్రతిస్పందించడానికి లేదా మన హృదయాలను కఠినం చేసి ఆయనను విస్మరించడానికి మనకు ఎంపిక ఉంటుంది. విచారకరంగా, కొందరు వ్యక్తులు తమకు కావలసినదానిని పొందనప్పుడు లేదా వారు పరీక్షలు మరియు శోధనల ద్వారా వెళ్ళినప్పుడు, వారు తమ హృదయాలను కఠినతరం చేసుకుంటారు.
ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు సరిగ్గా అదే జరిగింది. దేవుడు వారి కోసం గొప్ప విషయాలను యోచన (ప్లాన్) చేసాడు, అయితే వారు నిజంగా ఆయనను విశ్వసించబోతున్నారా అని చూడటానికి మొదట వారిని పరీక్షించాడు. ఆయన వారిని ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘమైన, కఠినమైన మార్గంలో నడిపించాడు-వారు తన ఆజ్ఞలను పాటిస్తారా లేదా అని చూడడానికి. ఆయన వాక్యంలో, వారు చేసినట్లుగా మన హృదయాలను కఠినం చేసుకోవద్దని చెప్పారు (హెబ్రీయులు 3:7-8 చూడండి).
వారి సమస్యలు వారికి మేలుగా కాకుండా చేదుగా మారాయి. వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు మరియు దేవుని మార్గాలను నేర్చుకోలేదు. వారు చాలా తప్పుడు వైఖరిని కలిగి ఉన్నారు మరియు వారు దేవుణ్ణి విశ్వసించడానికి నిరాకరించినందున పురోగతి సాధించకుండా నిరోధించబడ్డారు.
కష్ట సమయాల్లో మీ హృదయాన్ని కష్టపెట్టుకోవద్దు. కఠినమైన హృదయాలు కలిగిన వ్యక్తులు తిరుగుబాటుదారులు మరియు దిద్దుబాటును నిరాకరిస్తారు. వారు దేవుని నుండి వినడానికి కష్టంగా ఉన్నారు మరియు వారు సంబంధాలలో ఇబ్బందులు కలిగి ఉంటారు. వారు ఇతరుల అభిప్రాయాలను చూడటానికి ఇష్టపడరు; వారు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోరు మరియు సాధారణంగా వారి గురించి పట్టించుకోరు. వారు స్వీయ-కేంద్రీకృతులుగా మరియు కనికరముతో కదలలేరు.
మన హృదయాలను మృదువుగా చేయడానికి మరియు ఆయన స్పర్శకు మరియు ఆయన స్వరానికి సున్నితత్వం మరియు సున్నితంగా ఉండటానికి సహాయం చేయడానికి మనం ఉత్సాహముగా దేవునిని వెతుకుదాం.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు ఆశించిన రీతిగా మీ పనులు జరగనప్పుడు, దేవుని యందు నమ్మిక యుంచండి మరియు మంచి వైఖరిని కలిగి యుండండి.