దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు

దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు

“యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక…” —సంఖ్యా కాండము 6:24-26

మనము ప్రజల మీద మాటలను ధృవీకరించి మాట్లాడాలి. మనము సంఖ్యకాండము 6:24-26 లోని ఈ ఆశీర్వాదమును పునర్జీవింపజేయాలి: ప్రభువు నిన్ని కాయును, నీకు కావాలి కాయును, మరియు భద్రముగా ఉంచును; ఆయన ముఖమును మీ మీద ప్రకాశింపజేయును మరియు వెలిగింపజేయును మరియు నీ మీద కృప (దయ, కనికరము, మరియు కృపను అనుగ్రహించును) కలిగి యుండును; యెహోవా నీమీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ జేయును గాక…

మరో మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను చూసి చిరునవ్వు నవ్వును. దానిని గురించి ఆలోచించండి. మీరెప్పుడైనా మీరు ఒకరిని చూసి చిరునవ్వు నవ్వినప్పుడు, నీవు వారితో ‘నేను నిన్ను అనుమతిస్తున్నాను. నిన్ను అంగీకరిస్తున్నాను. నీవు చల్లగా ఉండుము.’అని అర్ధము.

దేవుడు కేవలం నిన్ను అనుమతించుట మాత్రమే కాక, ఆయన నీ వైపు చిరునవ్వుతో నవ్వును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు! అది నీ హృదయంలోనుండి ఎవరూ తీసివేయకుండునట్లు మీ హృదయములో లోతుగా నాటబడునట్లు అనుమతించండి.

మీరు దేవుని ప్రేమలో నాటబడినప్పుడు, మీరు విశ్వాసములో నిలబడునట్లు మరియు ఆయన యందు విధేయతలో నడచుట ప్రారంభించుటకు సహాయపడును. కానీ, మీ స్వంతగా మంచి పనులుచేయుటకు ఆయనకు ముందుగా మీరు ప్రయత్నించలేరు. మీరు వాక్యమును ఎరిగియుండవలెను తద్వారా మీరు క్రీస్తులో ఎవరై యున్నారనే విషయాన్ని మీరు తెలుసుకొనగలరు.
కీర్తన 18:19లో దావీదు “నేను ఆయనకు ఇష్టుడను గనుక…”అని

చెప్పియున్నాడు. దావీదు పరిపూర్ణుడు కాదు కానీ ఆయన దేవుడు ఆయన యందు ఆనందించుచున్నాడు. దేవుడు నీ యందు కూడా ఆనందించుచున్నాడు. నీ హృదయాంత రంగములో ఆ సత్యమును కలిగి యుండండి. ఆయన నీ యందు ఆనందించుచున్నాడు మరియు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు. దేవుడు నిన్ను అనుమతించుచున్నాడు!


ప్రారంభ ప్రార్థన

దేవా, నన్ను ప్రేమించి అంగీకరించినందుకు వందనములు. నాతో చిరునవ్వు నవ్వినందుకు వందనములు. నీ ప్రేమ నా జీవితాన్ని మార్చివేసింది మరియు నేను నీలో వృద్ధి చెందుతున్నప్పుడు అది కొనసాగుతుందని నాకు తెలుసు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon