దేవుడు మిమ్మల్ని నూతన స్థాయిలోనికి తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాడు

దేవుడు మిమ్మల్ని నూతన స్థాయిలోనికి తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాడు

జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును (దేవునితో యధార్ధముగా మరియు సరైన స్థితిలో ఉన్న వ్యక్తి). (సామెతలు 9:9)

దేవుడు మనల్ని ఆనందముగా, సంతృప్తికరమైన జీవితాలను జీవించాలని ఆశించినప్పటికీ, ఆయన కొన్నిసార్లు అసంతృప్తిని కలిగిస్తాడు లేదా ఏదో తప్పు చేస్తున్నామనే భావనను మనలో కలిగిస్తాడు, ఎందుకంటే మనం ఇకపై అదే పాత పనులను కొనసాగించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన మనలను నూతన స్థాయిలకు నడిపించునట్లు ఆయనను వెదకుటకు మనలను ప్రోత్సహించాలని ఆయన కోరుకుంటున్నారు.

దేవుడు ఎల్లప్పుడు మనము బలముగా ఎదగాలని, లోతుగా వెళ్లాలని, మరియు ఆయనతో సన్నిహితత్వము పెరగాలని ఆశిస్తాడు. చాలా సమయం మనము గతములో సౌకర్యవంతముగా ఉన్న స్థలములలోనికి మనల్ని నడిపించుట ద్వారా పరిపక్వత అనే ప్రక్రియలోనికి మనల్ని నడిపిస్తాడు. ఎక్కువ సమయం ఎక్కువ సౌకర్యములో ఉన్నట్లైతే, మనము ఎదుగుట లేదని అర్ధము. మీ హృదయములో అర్ధము కానీ ఏదో తిరుగుతుందనే భావన కలుగుతుంటే, ఏమి జరుగుతుందో దేవునిని అడిగండి మరియు ఆయన మీకు జవాబు ఇచ్చునట్లు సమయం తీసుకోండి.

మన ఎదుగుదలకు మరియు పరిపక్వతకు దేవునితో మన సమయము చాలా ముఖ్యమైనది, అయితే మనము ఎల్లవేళలా ఒకే విధమైన పనులను చేయలేము మరియు దేవుడు మనకు కలిగి ఉన్నవన్నీ అనుభవించలేము. బైబిల్ చదవడంలో శ్రమతో కూడుకున్న సందర్భాలు నాకు ఉన్నాయి మరియు కొన్ని నెలలపాటు వేరే అనువాదాన్ని చదవడానికి దేవుడు నన్ను నడిపించాడు. ఆ చిన్న మార్పు కొత్త వృద్ధిని తెచ్చిపెట్టింది ఎందుకంటే నేను విషయాలను వేరే విధంగా చూశాను. నేను బైబిల్ చదవాలనుకోలేదు కాబట్టి సాతాను నన్ను ఖండించడానికి ప్రయత్నించాడు, కానీ నేను చదువుతున్న అనువాదంలో మార్పు తీసుకురావాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు నేను చదవడానికి మరియు ప్రార్థన చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు కొంచెం బోర్ అనిపించింది, కాబట్టి నేను మా కార్యాలయంలోని మరొక కుర్చీకి మారాను మరియు అకస్మాత్తుగా నా కార్యాలయంలో సంవత్సరాలుగా ఉన్న వస్తువులను చూశాను, కాని నేను వాటిని గమనించలేదు. ఒక చిన్న సర్దుబాటు (అడ్జస్ట్‌మెంట్) వల్ల నేను విషయాలను పూర్తిగా కొత్త కోణం నుండి చూడగలిగాను మరియు నేను వేరే కుర్చీలో కూర్చున్నందున దేవుడు నాకు ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించాడు.

ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ కుర్చీని కదిలించుటకు భయపడవద్దు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon