దేవుడు మీతో జ్ఞానమును మాట్లాడును

దేవుడు మీతో జ్ఞానమును మాట్లాడును

తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. (సామెతలు 2:3–5)

ఈరోజు వచనములు జ్ఞానమును వెదకమని మరియు వివేచన కొరకు మొర్ర పెట్టమని మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు ముగింపును ఆరంభమునుండే చూస్తాడు మరియు మనకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మనం అనుదిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొన్నా లేదా శత్రువు యొక్క పూర్తి స్థాయి దాడిని ఎదుర్కొన్నా, దేవుని జ్ఞానం మార్పును కలిగిస్తుంది-మరియు ఆ జ్ఞానాన్ని పొందడానికి దేవుణ్ణి అడగడమే ఏకైక మార్గం.

అనేకసార్లు మనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మనకు జ్ఞానమును ప్రత్యక్ష పరుస్తాడు. ఒక పరిస్థితికి సంబంధించిన నిర్దిష్ట అంతర్దృష్టిని పంచుకోవడం ద్వారా లేదా మనం నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఏమి చేయాలో స్పష్టంగా చెప్పడం ద్వారా ఆయన అలా చేయవచ్చు. ఆయన తన జ్ఞానాన్ని వివిధ మార్గాల్లో తెలియజేస్తాడు మరియు మనం దానిని ఎల్లప్పుడూ విలువైన బహుమతిగా స్వీకరించాలి.

దేవుని జ్ఞానాన్ని అమూల్యమైన ఆధ్యాత్మిక నిధిగా విలువైనదిగా పరిగణించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మరియు అది లేకుండా మీరు చేయలేనిదిగా భావించండి-ఎందుకంటే మీరు విజయవంతమైన జీవితాన్ని పొందాలనుకుంటే మీరు చేయలేరు. చిన్న మరియు పెద్ద ప్రతి పరిస్థితిలో దేవుని జ్ఞానాన్ని ప్రార్థించడం మరియు అడగడం అలవాటు చేసుకోండి. అతను దానిని మీకు ఇస్తాడు మరియు మీరు ఫలితాలతో పులకరించి (థ్రిల్) పోతారు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుని జ్ఞానము అవసరములేని ఏ విషయమైనా చిన్నది కానేరదు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon