దేవుడు మీ జీవితములోని లాజరులను లేపగలడు

దేవుడు మీ జీవితములోని లాజరులను లేపగలడు

అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; —యోహాను  11:40

మరియ మరియు మార్తల సోదరుడు లాజరు మరణించిన తరువాత నాలుగు రోజులకు యేసు అక్కడికి వచ్చినట్లు మీకు గుర్తుందా? ఆయన చివరకు అక్కడకు వచ్చినప్పుడు నీవు ఇక్కడ ఉండిన్నట్లైతే నా సహోదరుడు చావకుండా ఉండి యుండునని అతని సహోదరియైన మార్త యేసుతో చెప్పి యున్నది (యోహాను 11:21).

మార్త స్పష్టముగా చాలా వేదనలో ఉన్నట్లు కనపడుతున్నది. తరువాత, యేసు ఆమెతో, నీ సహోదరుడు తిరిగి లేచునని చెప్పెను. అయితే మార్తా ఆయనతో అతడు అంత్యదినమందు పునరుత్థానములో తిరిగి లేచునని నేనెరుగుదును అని చెప్పెను (23-24 వచనములు). యేసు ఏమి చెప్తున్నాడో ఆమెకు నిజముగా అర్ధం కాలేదని నేను అనుకుంటున్నాను. ఆమె భవిష్యత్తులోని సంభావ్యతను గురించి మాట్లాడుతుంది కానీ ప్రస్తుత వాస్తవమును గురించి కాదు. ఆమె నిజముగా పరిస్థితుల మార్పు కొరకు ఎదురు చూడటం లేదు. మనలో అనేకమంది మార్తా వలెనే పరిస్థితుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. కానీ యేసు లాజరును మరణమునుండి లేపినట్లే ఆయన మీ జీవితాల్లో ఉన్న లాజరులను కూడా లేపగలడు అనగా మీ సమబంధాలలో, ఆరోగ్యము మరియు ఆర్ధిక విషయాల్లో పునరుద్ధరించగలడు లేక  మిమ్మును మీ జీవితములో ఆయన చిత్తములో ముందుకు వెళ్లకుండా ఆపుతున్న అడ్డంకులను ఆయన తీసి వేస్తాడు. మీ అవసరత ఏదైనప్పటికీ దేవునితో సమస్తమును సాధ్యమే! (మార్కు 10:27 చూడండి).

నిరీక్షణ కోల్పోవద్దు. మీరు ఈ సమయములో గాయపడవచ్చు, కానీ ప్రతి నిరాశలో నుండి దేవుడు ఒక నూతన ప్రారంభమును అనుగ్రహించును. దేవునియందు నమ్మిక యుంచుము మరియు మీ జీవితములో ఆయన మహిమను చూపించునట్లు ఆయన వైపు చూడండి.

ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నా జీవితములోని ప్రతి పరిస్థితిని మీరు మీ మహిమ నిమిత్తమును మార్చగలరని నేను నమ్ముతున్నాను.  నా సమస్యలలో నేను పట్టుబడుట కంటే నా జీవితములోని‘లాజరులను’నీవు లేపగలవని నేను నీ యందు నమ్మికయుంచు చున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon