నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. —కీర్తనలు 37:5
దేవునియందు నమ్మిక యుంచుట నేర్చుకొనుట ద్వారా మీ జీవితమును మీరు సులభతరం చేసుకొనవచ్చును. చాలా తరచుగా, మనం నమ్మడానికి అనుమతించము. ఒకవేళ గతంలో మీ నమ్మకం చాలాసార్లు మోసం చెయ్యబడి యుండవచ్చు, లేదా మీరు చాలా స్వతంత్ర వ్యక్తి కావచ్చు. అయినప్పటికీ, దేవునిని నమ్ముటకు నేర్చుకోవడ0 చాలా క్లిష్టమైనది.
మీ జీవితంలో మీ స్వంత పనిని చేయడానికి ప్రయత్నించి, ఒత్తిడిని తగ్గించడం మరియు అమలు చేయడం సులభం, కానీ ఇది ఎప్పుడూ పనిచేయదు. మరియు దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మీ స్వంత ప్రయత్నం కంటే మంచిది. దేవునిని నమ్మే వ్యక్తి ఆయన మార్గం ఉత్తమమని తెలుసు కుంటాడు.
ఇప్పుడు నమ్మకం అనునది కేవలం అద్భుతముగా జరుగదు. మనము విశ్వాసపు అడుగులు వేసుకుంటూ దేవుని నమకత్వమును అనుభవించినప్పుడు నమ్మకం పెరుగుతుంది. మీరు సందేహమును, భయమును, అభద్రతను ఎదిరించవలెను అప్పుడు మీరు దేవునిని పూర్తిగా నమ్మే జీవితాన్ని పొందుకుంటారు. మీరు దానిని చేసినప్పుడు మీ జీవితము పని చేయునట్లు చేయుటకు మీరు కష్టపడవలసిన పని లేదు.
దేవుని యందు నమ్మిక యుంచుట ద్వారా దేవుడు ఆశించినట్లు మనము సులభమైన మరియు స్వేచ్చా జీవితమును అనుమతించినప్పుడు మన ప్రాణమునకు అసాధారణ విశ్రాంతి దొరుకును. కాబట్టి మన జీవితము అర్ధవంతముగా లేనప్పుడు ఆయన యందు నమ్మిక యుంచి ఆయన స్వేచ్చను మరియు విశ్రాంతిని అనుభవించుము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీ మార్గములు నా మార్గముల కంటే ఉత్తమమైనవి మరియు నా స్వంత బలము మీద ఆధారపడుట వలన నేనేమీ చేయలేను. నా నమ్మకమును మీలో ఉంచుచున్నాను. అది నా జీవితమునకు అర్ధవంతముగా లేనప్పుడు కుడా నీ యందు నమ్మిక యుంచుటకు మరియు మీ ప్రణాళికలు నా జీవితములో నెరవేర్చబడతాయని నేను ఎంపిక చేసుకొని యున్నాను.