దేవుడు వెదికే వ్యక్తిగా ఉండుము

దేవుడు వెదికే వ్యక్తిగా ఉండుము

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.  —2 దినవృత్తాంతములు 16:9

దేవుడు ఉత్సాహంగా ఉన్న విషయాల పట్ల మక్కువగల ప్రజలను చూస్తున్నాడు. ఆయనను హృదయపూర్వకముగా వెదికే వారి కొరకు అయన చూస్తున్నాడు. ప్రజలు వారి ఉద్యోగాలలో, పొరుగువారిలో మరియు గృహములలో ఉన్న ప్రజలను ప్రేమించే వారి కొరకు ఆయన చూస్తున్నాడు; తప్పిపోయిన వారిని, బీదలను మరియు అవసరతలో ఉన్న వారిని ప్రేమించేవారి కొరకు అయన చూస్తున్నాడు.  బైబిలు మనమేమి చేయాలనీ చెప్పి యున్నదో దానిని  చేయటానికి సిద్ధంగా ఉన్నవారి కొరకు ఆయన అన్వేషిస్తున్నాడు.

 2 దినవృత్తాంతములు 16:9 మనకు తెలియజేయునదేమనగా ఎవరి హృదయాలైతే నిందారహితముగా ఉంటాయో వారి పక్షమున అయన బలవంతుడుగా ఉండునట్లు చూపించుటకు అయన వెదకుచున్నాడు.

మీరు వారిలో ఒకరై యున్నారా? కాని యెడల, దేవుడు వెదకుచున్న వారిలో మీరు కూడా ఒకరి వలె ఉండునట్లు మీరు తెలుసుకొనవలెనని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

మీరు ప్రభువును గురించి అనేక సంవత్సరములు తెలుసుకున్నా లేక ఆయనలో మీరు ఇప్పుడే నూతన జీవితమును ప్రారంభించినా మీరు ఆసక్తిగా దేవునిని వేదకేవరుగా మరియు పరిశుద్ధత్మకు చెవి యోగ్గే వారుగా ఉండగలరు.  గాయపడిన ప్రజల జీవితాల్లో మీరు ఉత్సాహముగా విభిన్నతను కలిగించే వ్యక్తిగా మరగలరు.

ఈరోజే మీరు లేచి దేవుడు వెదకే వ్యక్తిగా ఉండుము.

ప్రారంభ ప్రార్థన

దేవా, అన్నిటి కన్నా ఎక్కువగా, మీరు ఈ లోకములో వెదికే వ్యక్తివలె నేను ఉండాలని ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలని మీరు కోరుతున్నారో ఆ మార్గములో నన్ను నడిపించుము మరియు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా, మీ వాక్యమునకు విధేయత చూపే వ్యక్తిగా మరియు నిజముగా మిమ్మల్ని తెలుసుకునే వ్యక్తిగా నన్ను మలచండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon