దేవుడు సరియైన సమయంలో పనులు జరుగునట్లు చేస్తాడు

దేవుడు సరియైన సమయంలో పనులు జరుగునట్లు చేస్తాడు

ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. —హబక్కుకు 2:3

మీ హృదయ వాంచలు తీర్చబడవలెనని మీరు వేచి యున్నారా? మీరు భయము నుండి విడుదల పొందాలని లేక మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విషయాలను గురించి లేక మీ కలలు నెరవేర్చబడవలేనని ప్రార్దిస్తున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు లేక స్నేహితుల రక్షణ గురించి ప్రార్థిస్తున్నారా? మీరు దేవుని అనుగ్రహము, కృప, హెచ్చింపు, గౌరవము మరియు ఆయన వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదము కొరకు నమ్మిక కలిగి యున్నారా?

మీ ప్రార్ధనల కొరకైన జవాబుల కొరకు వేచియుండుటలో మీరు అలసిపోయి యున్నారా? మీరు విసుగు చెందినట్లైతే, ఆశ్చర్యచకితులైనట్లైతే, ఎప్పుడు దేవా ఎప్పుడు? కాబట్టి దేవుని సమయం ఒక నిగూఢమైన విషయమని మీరు తెలుసుకొనుట ప్రాముఖ్యమైనది. మీ కాలమానము ప్రకారము ఆయన పనులు చేయడు. అయినప్పటికీ ఆయన వాక్యము ఆలస్యము కాదని ఒకే రోజులో జరుగదని వాగ్దానం చేస్తుంది.

దేవుడు తన కార్యములను అనుకూల సమయమున జరుగునట్లు చేయును! మీ ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో కాదు కానీ మీరు ముగింపు రేఖను దాటి మరియు దేవుని యొక్క అత్యంత గంభీరమైన ఆశీర్వాదంలో జీవిస్తున్నంత  వరకు మీరు దానిని విడిచి పెట్టకుండా మీ మనస్సును స్థిరపరచుకోవాలి! మీరు నీ దృష్టిని ఎంత ఎక్కువగా యేసు మీద ఉంచుతారో మీరు అంత గొప్ప జీవితాన్ని కలిగి యుంటారు. దేవుని యందు నమ్మిక యుంచుట మీకు జీవాన్నిస్తుంది.  నమ్ముట విశ్రాంతిని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి దానిని పొందుకొనుట ఆపండి మరియు దేవుని మీ జీవితములో ఉండనీయండి!


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను వేచి యుండుటలో విసిగి పోయినా మీ సమయం చాలా పరిపూర్ణమైనదని నాకు తెలుసు. మీ యందు నమ్మిక యుంచుటకు మరియు నా కొరకు మీరు కలిగియున్న ప్రణాళికలో విశ్రాంతిని కలిగి యుండునట్లు నాకు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon