దేవుడెక్కడ?

దేవుడెక్కడ?

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. (యెషయా 55:6)

నేను పరిచర్యలో ఉన్న సంవత్సరాల్లో, “నేను దేవుని సన్నిధిని ఎందుకు గ్రహించలేను?” అని నన్ను తరచుగా అడిగే వారు. ఒక్కోసారి నేనూ అదే ప్రశ్న వేసుకున్నాను.

మనం ఆయనకు నచ్చని పని చేసిన ప్రతిసారీ పరిశుద్ధాత్మ పారిపోడని మరియు మనలను విడిచిపెట్టడని లేఖనాల ద్వారా మనకు తెలుసు (హెబ్రీ 13:5 చూడండి). నిజానికి, ఆయన మనతో అంటిపెట్టుకుని ఉండి, మన సమస్యల పరిష్కారానికి మనకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాడు, ఎటువంటి సహాయం లేకుండా మనల్ని ఆయన వదిలివేయడు.

లేదు, పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, కానీ ఆయన కొన్నిసార్లు “దాచుకుంటాడు.” కొన్నిసార్లు దేవుడు తన పిల్లలతో దాగుడుమూతలు ఆడుతాడని నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు ఆయన మన నుండి దాగుకుంటాడు, చివరికి మనం ఆయనను కోల్పోయినప్పుడు, మనం ఆయనను వెతకడం ప్రారంభిస్తాము. మరియు మనము ఆయనను వెదకినప్పుడు, మనము ఆయనను కనుగొంటామని ఆయన వాగ్దానము చేస్తాడు (1 దినవృత్తాంతములు 28:9; యిర్మీయా 29:13 చూడండి).

ఆయన వాక్యంలో, దేవుడు తనను వెదకమని పదే పదే చెబుతున్నాడు-ఆయన ముఖాన్ని, ఆయన చిత్తాన్ని, మన జీవితాల కోసం ఆయన ఉద్దేశాన్ని వెతకాలని. వెతకడం అంటే కోరిక, వెంబడించడం మరియు మీ శక్తితో వెళ్లడం ద్వారనే ఇది సాధ్యం. ముందుగానే, శ్రద్ధగా మరియు ఆసక్తిగా ఆయనను వెదకమని కూడా మనకు చెప్పబడింది. మనం దేవుణ్ణి వెతకకపోతే నిరాశతో కూడిన జీవితాలను గడుపుతాం. దేవుణ్ణి వెతకడం అనేది ఆయన మనం చేయాలనుకుంటున్నది మరియు చేయమని ఆదేశిస్తాడు; అది ఆయనతో మన నడకకు ప్రధానమైనది మరియు ఆధ్యాత్మిక పురోగతికి ముఖ్యమైనది. దేవుడు మీకు ఎంత ముఖ్యమో మరియు ఆయన లేకుండా మీరు ఏమీ చేయలేరని చెప్పండి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవునిని మీ జీవితములోని ప్రతి విషయములో పని చేయునట్లు ఆయనను ఆహ్వానించుట ద్వారా దేవుని ఘనపరచండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon