యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు..… —మలాకీ 3:6
మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, ఏమీ మారదు… నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను… నా పరిస్థితి ఎప్పటికీ మారదు… అతడు ఎప్పటికీ మారడు… ఆమె ఎప్పటికీ మారదు… నేను ఎప్పుడూ అంత మంచిగా ఎందుకు ఉండను? అని ఎందుకు మనం ఆలోచిస్తున్నాము?
ఎన్నడూ మారని ఒకే వ్యక్తి దేవుడు. మిగిలిన సమస్తము మారుతుంది.
మీ పరిస్థితిలో మార్పును చూడాలనే ఆశ మీకు లేకపోతే, మార్పు బహుశా రాదు. మీకు తెలుసా, మనము చాలా కఠినమైన విషయాలను మానసికంగా భరిస్తాము, మనం దేవునిపై ఆశ కలిగియుంటే మరియు మనం నియంత్రించలేని అన్ని పరిస్థితులను గురించి బాధ పడటం మానేస్తే మనం నిజంగా బాధపడనవసరం లేదు.
ఇక్కడ ఒక శుభవార్త ఉన్నది: మీరు ఆనందించాలని ఆశిస్తే మీరు మీ జీవితంలో ఆనందించగలరు! కానీ మీరు ఆనందించుటలో కొనసాగుట దేవుని చిత్తమని మీరు ఖచ్చితముగా నమ్మాలి. అప్పుడు మీ శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అవసరమైన ఆ ఆనందంలోకి ప్రవేశించాలని మీరు నిర్ణయించుకోవాలి.
దేవుడెన్నడూ మారడు, కానీ నీవు అనుమతించిన యెడల ఆయన నిన్ను మార్చగలడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, కొన్నిసార్లు నా పరిస్థితులు ఎన్నడూ మారవని నేను భావిస్తున్నాను, కానీ మీరు వాటిని మార్చగలరని మరియు నన్ను కూడా మారుస్తారని నేను ఎరిగి యున్నాను. నేను మీ ఆనందమును పొందుకొనుటకు ఎన్నుకొని యున్నాను మరియు నా జీవితమును మార్చుటకు నీ యందు నమ్మిక యుంచి యున్నాను.