
ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దానిని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. —యెహోషువ 1:8
మనము ఎంత ఎక్కువ సమయం దేవుని వాక్యమును ధ్యానించుట మరియు మాట్లాడుటలో మనము గడుపుతామో మనము మన అనుదిన జీవితములో ప్రయోజనములను మనము చూస్తాము మరియు ఆయనతో సన్నిహిత సంబంధమును కలిగి యుంటామని దేవుడు చెప్పియున్నాడు. మనము అభివృద్ధి చెంది విజయవంతముగా జీవిస్తామని ఆయన వాగ్ధానము కూడా చేసి యున్నాడు! (యెహోషువా 1:8 చూడండి.)
నేను అనేక శోధనలు మరియు కష్ట సమయాల గుండా వెళ్లి యున్నప్పుడు నా జీవితములో దేవుని వాక్యమును ఒప్పుకొని నమ్మి యున్నాను కనుక నేను దీనిని గురించి సాక్ష్యము చెప్పగలను.
మనము ఆయన వాక్యమును స్వరమెత్తి చదివినట్లైతే శక్తివంతమైనది ఒకటి జరుగును. మనము ఉద్దేశ్యపూర్వకముగా యదార్ధమైన ఆలోచనలను ఆలోచించుటకు ఇది ఒక మార్గము, ప్రత్యేకించి మనము లేఖనములను విశ్వాసముతో వ్యక్తిగతముగా ఒప్పుకొనినప్పుడు ఇది సంభవించును.
వాక్యమును చదువుట మరియు దానిని హృదయములోనికి పొందుకొనుట చాల గొప్ప విషయము, కానీ దానిని మనము గొంతెత్తి పెద్దగ చదివినప్పుడు, దేవుడు చెప్పేదానికి మీరు ఉత్సాహముగా కలిసిపోతారు మరియు ఆ శక్తి మీ జీవితములోనికి ప్రవేశిస్తుంది.
దేవుని వాక్యమును చదువుట మరియు ధ్యానించుటలో మీ సమయాన్ని గడపమని మరియు దానితో మీ ఆలోచనలను సరిచూచుకొనుమని మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. కానీ నేను మిమ్మును వాక్యము పలకమని అర్ధిస్తున్నాను. దేవుడు పలికిన దానిని పలుకుట ద్వారా మీ జీవితమును మార్చుకొనే దిశలో మీ మనస్సు పని చేయునట్లు మీరు సిద్ధపడగలరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ వాక్యములోని పూర్తి శక్తిని నా జీవితములోనికి విడుదల చేయమని కోరుతున్నాను. మీ వాక్యమును చదువుట మరియు దానిని గురించి ఆలోచించుటతో పాటుగా దానిని ఈరోజు నా జీవితములో మాట్లాడవలెనని ఎన్నుకొని యున్నాను.