దేవుడే మన ఆధారము, కానీ లోకము కాదు

దేవుడే మన ఆధారము, కానీ లోకము కాదు

విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు (ఉత్తేజపూర్వకమైన మంచితనము, దయ మరియు ఔదార్యమును) వృద్ధిపొందించును.  —2 కొరింథీ 9:10

దేవుని ఆర్ధిక వ్యవస్థ లోక వ్యవస్థ వంటిది కాదు. మరియు మన చుట్టూ ఏమి జరుగుతున్నప్పటికీ, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక మనము భయపడవలసిన అవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్థలు తరచుగా స్థిరత్వము లేకుండా ఉంటుండగా, దేవుని ప్రేమ ఎన్నడూ మారదు మరియు జీవితములో బలమైన పునాదిగా నిలబడుతుంది. ఏమి జరుగుచున్ననూ దేవుడు మనకు సహాయం చేస్తాడని మరియు మన అనుదిన అవసరతలు తీర్చునట్లు ఆయన తన మార్గమును దాటి ముందుకు వెళ్లి మనకు సహాయం చేస్తాడనే ఆత్మ విశ్వాసమును మనము కలిగి యుండగలము.

2 కొరింథీ 9:10 మనకు నొక్కి పలుకునదేమనగా దేవుడు మన అవసరతలను తీర్చును మరియు తినుటకు ఆహారమును ఇచ్చును.

మన అవసరతలను తీర్చువాడు దేవుడే. మన ఆధారము మన ఉద్యోగములు కాదు – కానీ దేవుడే. కాబట్టి మన ఉద్యోగములు మరియు పెట్టుబడులు మాయమై పోయినప్పుడు, మనము నిస్సహాయులుగా భావించనవసరం లేదు ఎందుకంటే దేవుడు మితిలేని వాడు. ఆయన మనకు ఇతర ఆధారముల ద్వారా, మనము ఉహించని రీతిలో లేక ముందుగానే గుర్తించని రీతిలో ఆయన సహాయం చేయగలడు.

మత్తయి 6:26 ద్వారా దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తుండగా మనకు కుడా ఆయన సమస్తమును అనుగ్రహించునని ఆయన మనకు నిశ్చయతను అనుగ్రహించి యున్నాడు. దేవుడు మీ గురించి శ్రద్ధ కలిగి యున్నాడని నీవు నమ్ముతున్నావా?


ప్రారంభ ప్రార్థన

దేవా, నా ప్రతి అవసరతను తీర్చుచు నమ్మకమైన వాడుగా యోగ్యమైన వాడుగా ఉన్నందుకు వందనములు. ఏమి జరిగినప్పటికీ నేను మీ మీద ఆధారపడగలను మరియు మీరు మాత్రమే నా అవసరతలను తీర్చగలవు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon