దేవునిని “అబ్బా” అని పిలవండి

దేవునిని “అబ్బా” అని పిలవండి

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను (కుమారత్వమును అనుగ్రహించే ఆత్మను) పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము .  —రోమా 8:15

భయము అనునది మన జీవితాల్లో శక్తివంతమైన ప్రభావముగా ఉంటుంది, కానీ ఇది నిజముగా విశ్వాసమును వక్రీకరించే శత్రువు కార్యమై యున్నది. అతడు మనతో ఇలా చెప్తాడు, “నేనేమి చెప్తున్నానో దానిని నమ్మండి. ఇది ఖచ్చితముగా పని చేయదు. ప్రార్ధనలు ఏమాత్రము మంచివి కావు. మీరు దేవుని ఎదుట యధార్ధముగా నిలువలేరు. నీవు ఒక విఫలుడవు.”

భయము ఎల్లప్పుడూ మీరేది కాదో, మీరేమి కలిగి యుండలేదో, మీరేమి చేయలేరో మరియు మీరెన్నడూ ఎలా ఉండలేరో వాటిని గురించి చెప్తాడు. కానీ రోమా 8:15 చెప్తున్నదేమనగా నీవు దేవునిని “అబ్బా, తండ్రీ” అని పిలిచే దేవుని కుమారుడవై యున్నావు.

అబ్బా అనే మాట చిన్నారులు తమ తండ్రిని పిలిచేటప్పుడు ఉపయోగించే పదము. అది మనము ఉపయోగించే “డాడి” అనే పదమునకు సమానముగా ఉంటుంది. ఇది తండ్రి కంటే కొంచేం తక్కువ గౌరవమును ఇస్తుంది మరియు ఇది బిడ్డ మరియు తండ్రిని మధ్య సన్నిహిత సంబంధమును సూచిస్తుంది.

మనము ఆయనను అబ్బా అని పిలవవచ్చని చెప్పాడు ఎందుకనగా ఆయన మనలను భయము నుండి విడిపించాడు.  ఆయన ఎల్లప్పుడూ తన ప్రియమైన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు మనము తృణీకరించబడతామనే భయము లేకుండా ఆయనను చేరుకొనగలము. మనము ఏదైనా బాధ లేక సమస్యతో ఆయన వద్దకు పరుగెత్తినప్పుడు ఆయన తన చాచిన చేతులతో మనలను ఆదరించుటకు మరియు ప్రోత్సహించుటకు వేచియున్నాడు.


ప్రారంభ ప్రార్థన

అబ్బా తండ్రీ, నన్ను మీ ప్రియమైన బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. మీరు నా గురించి శ్రద్ధ వహిస్తారని నాకు తెలుసు కాబట్టి భయమనే బంధకములో జీవించవలసిన అవసరంలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon