ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. – 1 కొరింథీ 8:6
మనము దేవునితో సౌకర్యముగా ఉండవలసియున్నది. మనము ఆయనతో అగౌరవముగా ఉండాలని అర్ధం కాదు కానీ మనము ఆయనకు భయపడనవసరం లేదు. వాస్తవముగా, ప్రతి విశ్వాసి యొక్క అంతిమ పిలుపు దేవునితో కలిసి ఆనందించడమేనని నేను విశ్వసిస్తాను. మనము తండ్రితో కలిసి ఆనందించటానికి మనము పిలువబడ్డాము ఎందుకనగా ఆయనే జీవము మరియు మనము దేవునితో కలిసి ఆనందించని యెడల మనము మన జీవితములో నిజముగా ఆనందించలేము.
మనము దేవునికి సేవ చేయుటలో, మనము కలిగియున్న వరములను కనుగొనుటలో మరియు మన సమయాన్నంతా పరిచర్యలో గడుపుట ద్వారా కొన్ని సమయాల్లో దేవుని సన్నిధిలో ఆనందించకుండా ఉంటాము. ఇది నాకు సంభవించింది. నా పరిచర్యలో దాదాపు ఐదు సంవత్సరములు నేను దేవుని కొరకు చేయుచున్న పరిచర్యలో గర్వించుచూ ఆయనలో ఆనందించకుండా ఉన్నప్పుడు దేవుడు నా జీవితములో అనేక ఆటంకములతో నా దూకుడుకు కళ్ళెం వేశాడు.
మనము చేయుచున్న పనుల ద్వారా మనము గర్వపడుట ప్రారంభిస్తున్నట్ట్లైతే మనము జాగ్రత్త వహించాలి. దేవుడు దానిని ఆశించుట లేదు. మన తండ్రిగా కేవలం ఆయనను గురించి తెలుసుకొని ఆయనలో ఆనందించవలెను.
కాబట్టి మీ పనులను బట్టి ఈరోజు మీరు గర్వించుచున్నారా అని మిమ్మల్ని అడగనివ్వండి. లేక మీరు నిజముగా దేవునిలో ఆనందించుచున్నారా?
ప్రారంభ ప్రార్థన
తండ్రియైన దేవా, నేను నీతో ఆనందించాలనుకుంటున్నాను. మీతో సహవాసము కలిగి యుండుట మరియు మీ సన్నిధిలో ఉండుట చాల శక్తి వంతమైనది. నేను నా గర్వమును ప్రక్కన పెట్టి మీ ఎదుట తగ్గించుకొనియుంటాను తద్వారా మీలో మాత్రమే నా ఉద్దేశ్యమును కనుగొని ఆనందిస్తాను.