![దేవుని అగాపే ప్రేమ](https://tv.joycemeyer.org/telugu/wp-content/uploads/sites/23/2023/02/2533-1024x597.jpg)
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. —యోహాను 3:16
బైబిల్ గ్రంధం అనేక రకములైన ప్రేమలను గురించి మాట్లాడుతుంది. అక్కడ ఫిలియో అనే ఒక గ్రీకు పదము ఉన్నది, దాని అర్ధము ‘స్నేహము లేక మృధువైన ప్రేమ’అని అర్ధము. తరువాత ఏరోస్ అను పదమునకు ఒక ప్రేమికురాలి యెడల చూపించే ప్రేమ. కానీ ఇక్కడ ఒక మూడవ రకపు – అత్యున్నతమైన ప్రేమ ఒకటి ఉన్నది.
దేవుడు తన కుమారునిపై మరియు మానవ జాతి యంతటి మీద చూపించే ప్రేమ అగాపే. ఇది త్యాగము చూపే ప్రేమ …. మనము యోహాను 3:16 లో దేవుడు చూపిన ప్రేమయై యున్నది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని …. అనుగ్రహించెను.
ఈ అంశము మీద అనేక లేఖనములున్నవి; మీరు దీనిని గురించి వ్యక్తిగతముగా అధ్యయనం చేయుటకు మీరు సమయమును వెచ్చించవలసి యున్నది. అగాపే ప్రేమను గురించి బోధించే మరియొక లేఖనం మత్తయి 4:4. ఇది మనకు బోధించునదేమనగా మన శత్రువులను ప్రేమించుచూ మనలను హింసించే వారి కొరకు ప్రార్ధించుమని చెప్తుంది.
మీతో మంచిగా ఉండే వ్యక్తుల కోసం ప్రార్థన చేయటం కష్టం కాదు. కానీ మిమ్మల్ని గాయపరచిన ప్రజల కోసం ప్రార్థిస్తారు. చర్చిలో మీ స్నేహితులతో సమావేశం సులభం. కానీ వారు నిరాశ మరియు ఒంటరిగా ఉన్న వారిని కలిసి కేవలం కొంచంసేపు వారు చెప్పేది వినుటకు చాలా కష్టంగా ఉంటుంది. అది అగాపే ప్రేమ. నీతివంతమైనది చేయడానికి మీ ఓదార్పుని త్యాగం చేస్తుంది.
మీరు వారితో సహనముగా ఉండుట ద్వారా, వారిని అర్ధం చేసుకొనుట ద్వారా, ప్రోత్సహించుట ద్వారా మరియు మీరు చేయగలిగి యుండిన దానిని గురించి ఏమి చెప్పకుండా ఉండుట ద్వారా “అగాపే ప్రేమ”ను చూపించవచ్చును. మనుషులుగా, మనం స్వతహాగా, స్వార్థపూరితంగా, “నా గురించి ఏమిటి?” అని నిరంతరం అడుగుతూ ఉంటాము. అగాపే ప్రేమలోని శక్తి ద్వారా స్వార్ధతపై యుద్ధాన్ని ప్రకటించుటకు ఇదే సరియైన సమయం.
ప్రేమను గురించి లేఖనములు చెప్పినదానిని మనము అధ్యయనం చేసికొని అర్ధం చేసుకొనినట్లు ఉద్దేశ్యముతో ప్రజలను ప్రేమించుట మరియు మంచిగా ఉండుటకు ఇదియే సమయం. మరియు మీలో ఉన్న దేవుని అగాపే ప్రేమ ఇతరులపై ప్రవహించనివ్వండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, మీ శక్తివంతమైన అగాపే ప్రేమ అద్భుతమైనదిగా ఉంది. నేను స్వార్ధతపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, ఒక నిర్ణయం తీసుకోవటానికి, నాకు ప్రయోజనకరముగా, అగాపే ప్రేమతో కూడిన జీవితాన్ని గడపునట్లు నన్ను బలపరచుము.