
మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. . –రోమా 6:13
దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ప్రణాత్మ దేహములతో సృష్టించాడు. విశ్వాసులవలె మన ఆత్మ మన మనస్సును, ఇష్టాలను మరియు భావోద్వేగాలను కలిగి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా”స్వీయ”మైనది మరియు పరిశుద్ధాత్మకు సమర్పించుటకు ఇష్టపడదు కాబట్టి అది శుద్ధి చేయబడాలి.
మనకు స్వేచ్ఛా సంకల్పం ఉన్నందున, మన మనస్సులు మనము ఏమనుకుంటున్నామో మనకు తెలియజేస్తుంది, కాని మన ఆలోచనలు తప్పనిసరిగా దేవుని ఆలోచనలు కాదు.
మన కోరికలు మనము కోరుకుంటున్నదానితో విరుద్ధంగా ఉన్నప్పటికీ, మనకు ఏది అవసరమో దానిని నిర్దేశిస్తుంది.
మన ఆలోచనలు కోరికలు భావాలను ఆయన ఆలోచనలు కోరికలు మరియు భావాలతో భర్తీ చేయాలని (నింపాలని) దేవుడు కోరుతున్నాడు. మనము దానిని చేసే వరకు పాపంపై విజయం సాధించలేము.
మీరు ఆయన ఆత్మను మీ ఆత్మలో కలిగి ఉండాలని దేవునికి చెప్పడం ప్రారంభించండి. రోమా 6లో, మనల్ని ఆయనకు “అర్పించు” అని పౌలు మనలను ప్రోత్సహిస్తున్నాడు. నేడు మీ ఎంపిక కోసం మీ ఆత్మను ఉపయోగించకూడదు, కానీ బదులుగా మీ “ఆత్మ”ను దేవునికి అప్పచెప్పండి.
ఆత్మ పరిశుద్ధ పరచబడినప్పుడు, దేవుని ఆలోచనలు, కోరికలు మరియు భావాలను తీసుకురావడానికి శిక్షణ పొందుతుంది, అప్పుడు మీరు అతని మహిమ కోసం ఒక శక్తివంతమైన మార్గముగా (అవుట్ లెట్) మారుతుంది.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నా మనస్సు, ఇష్టాలు మరియు భావోద్వేగాలు కొన్నిసార్లు మీవాక్యమునకు విరుద్ధముగా మారుతున్నాయి, కాని నేను ఆ విధంగా నివసించటానికి ఇష్టపడను. తండ్రి, నేను నీకు నా ఆత్మను అప్పగించుచున్నాను, నేను తెలిసి దానిని చేస్తున్నప్పుడు, మీరు నన్ను శుద్ధి చేయండి మరియు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఉపయోగించండి.