దేవుని కృపను అనుభవించుటలోని నిరీక్షణలో ఆనందించుట

దేవుని కృపను అనుభవించుటలోని నిరీక్షణలో ఆనందించుట

మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు (మనము) ప్రవేశముగల (పరిచయము)వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను (దేవిని కృపను గూర్చిన స్థితి) గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. —రోమా 5:2

బైబిల్ నీ కొరకు మరియు నా కొరకు నిరీక్షణను కలిగించే వాగ్దానములతో నిండి యున్నది. దేవుని సన్నిధిలో మీకు ప్రవేశము కలదు. ఆయన మన రోగముల నుండి స్వస్థపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన మన అవసరతలన్నియు తీర్చును. అవి ఎన్నో ఉన్నాయి … లెక్కలేనన్ని ఉన్నాయి! విశ్వాస లేమితో క్రైస్తవులు దేవుని వాగ్దానములను పొందుకొన లేకపోవుట ఎంతో విచారకరము.

ఇక్కడ ఒక ప్రశ్న కలదు: మీరు వాగ్ధనముల కొరకు ఎదురు చూస్తున్నారా? మీరు అనుదిన క్రమములో దేవుని కృపను అనుభవించుటలోని నిరీక్షణలో ఆనందించినప్పుడు మేలుకరమైన సంగతులు జరుగుట ప్రారంభమవుతుంది.

లూకా 2:52 మనకు చెప్తునదేమనగా, యేసు దేవుని దయ యందును, మనష్యుల దయ యందును వర్ధిల్లుతూ ఉన్నాడు. మీరు మరియు నేను విశ్వాసం ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందుతాము. మనము ఆ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందగలము మరియు యేసు వలెనే ఆయన వాగ్దానాలను అనుభవించవచ్చు. మీరు ఇప్పుడు మీ జీవితంలో ఆ విషయాలు చూడకపోయినా, అవి వస్తాయని తెలుసుకొని మీరు సంతోషించి దేవునిపై మీ ఆశ కలిగి యుండండి.

బైబిల్లో వాగ్దానం చేయబడినవన్నీ మన కోసమే. కాబట్టి ఇప్పుడే దేవుని మహిమను అనుభవించాలనే ఆశతో సంతోషించండి మరియు ఆయన మీ జీవితంలో నమ్మశక్యం కాని విషయాలు జరిగేలా చేస్తాడు


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నా కొరకు కలిగియున్న వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్నాను మరియు వాటిలో ఆనందిస్తున్నాను. నీ వాక్యములో నా కివ్వబడిన ప్రతి వాగ్ధానమును నెరవేర్చబడునని నేను నమ్ముతున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon