అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. (రోమీయులకు 6:11)
రక్షించబడని ప్రజలు ఆత్మీయంగా మరణించినవారు. దీనర్థం వారు దేవునితో సహవాసములో ఆనందించలేరు లేదా పరిశుద్ధాత్మ యొక్క సహజమైన ప్రేరేపణలను గ్రహించలేరు మరియు అనుసరించలేరు. ఈ వ్యక్తులు వారి సహజ లేదా మేధో జ్ఞానానికి మరియు వారి ఇంగితజ్ఞానానికి పరిమితముగా ఉంటారు; వారు ప్రత్యక్షత ద్వారా జీవించే అధికారాన్ని మరియు శక్తిని ఆస్వాదించలేరు. కానీ, మనం తిరిగి జన్మించి, ఆత్మీయంగా జీవించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడగలడు మరియు దైవిక ప్రత్యక్షత లేకుండా మనం తెలుసుకోలేని విషయాలను చూపగలడు.
గతంలో, నేను ఉద్యోగాలు మరియు బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించాను, అందులో నాకు ఇచ్చిన కార్యక్రమములను నిర్వహించడానికి నాకు అంత సహజ జ్ఞానం లేదు. కానీ, నేను ప్రభువుతో సన్నిహిత, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాను, కాబట్టి ఆయన నన్ను నడిపించాడు మరియు నేను పూర్తిగా శిక్షణ పొందని పనులను చేయడానికి నన్ను సిద్ధం చేశాడు.
పరిచర్యను ఎలా నడిపించాలో లేదా మాస్ కమ్యూనికేషన్‌ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో నేను ఎప్పుడూ అధ్యయనం చేయలేదు. కానీ దేవుడు నన్ను మరియు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్‌లోని బృందాన్ని ప్రపంచవ్యాప్తంగా మాస్ మీడియాతో సహా వివిధ మార్గాల్లో పరిచర్య చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనలను దశలవారీగా నడిపిస్తాడు. మనం వేసే విశ్వాసం యొక్క ప్రతి అడుగుతో, ఆయన మనకు బోధిస్తూ, తదుపరి ఏమి చేయాలో చూపిస్తూనే ఉంటాడు.
మీరు ఆయనతో సహవాసంలో ఉంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన దానిని చేయడానికి కూడా మిమ్మల్ని సిద్ధం చేస్తాడు. మీరు ఆయనను వెతకడానికి మరియు ఆయన స్వరాన్ని వినడానికి శ్రద్ధగా ఉంటే, ఆయన మిమ్మల్ని అసాధారణముగా నడిపిస్తాడు. మీ జీవితంలో తన ఉద్దేశాలను ఎలా నెరవేర్చాలో ఆయన మీకు బోధిస్తాడు-మరియు అవి మీరు ప్రస్తుతం చేయడానికి శిక్షణ పొందిన లేదా ఎప్పుడైనా ఊహించగల దానికంటే చాలా గొప్పవి కావచ్చు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీకు అవసరమైన సమస్తముతో దేవుడు నీకు శిక్షణ నిస్తాడు.