నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. (కీర్తనలు 40:8)
మనం దేవుని స్వరాన్ని విని, ఆయన చిత్తానికి లోబడాలని కోరుకుంటే, ప్రతి ఉదయం మన ప్రార్థన ఇలా ఉండాలని నేను నమ్ముతున్నాను:
“దేవా, నా జీవితమంతా నీ పరిపూర్ణ సంకల్పంలో నడవాలని కోరుకుంటున్నాను. మీ అనుమతించే సంకల్పం నాకు అక్కర్లేదు; నీ ఆమోదం మరియు ఆశీర్వాదం లేకుండా నేను ఏమీ చేయదలచుకోలేదు. నేను మీ కోసం ఉత్తమం కాని పనిని చేయడానికి ప్రయత్నిస్తే, దయచేసి నన్ను మీ ప్రణాళిక మార్గంలో ఉంచడానికి నా హృదయంలో సంకోచాన్ని, నా ఆత్మకు చెక్ పెట్టనివ్వండి.
నన్ను నేను నీకు సమర్పించుకొనుటకు సహాయం చేయండి.
తలబిరుసుగా ఉండకుండునట్లు సహాయం చేయండి.
మొండిగా ఉండకుండునట్లు సహాయం చేయండి
కఠిన హృదయము లేకుండునట్లు నాకు సహాయం చేయండి.
దేవా, నా జీవితములో నీ చిత్తము సంపూర్తిగా జరగాలని ఆశిస్తున్నాను. నేను నా మార్గములో వెళ్ళినట్లైతే, మరియు అది మీరు కోరుకొనినది కానప్పుడు అది చాలా చెడ్డ ఫలములను ఇస్తుందని నేను అనుభవించిన నా స్వంత చిత్తము యొక్క ఫలమును నాకు చాలును. నేను నీకు విధేయత చూపుటకు ఇష్టపడుతున్నాను, కానీ నేనేమీ చేయాలని మీరు ఆశిస్తున్నారో దానిని నేను స్పష్టముగా వినుటకు నాకు సహాయం చేయండి.”
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ప్రతిరోజూ అనేకసార్లు “నీ చిత్తము జరుగును గాక” దేవునితో చెప్పండి.