
నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. —సామెతలు 11:14
ప్రజలు కొన్నిసార్లు నన్ను, “నేను నిజముగా దేవుని సత్యములో నడుస్తున్నానా లేక నా భావనలు మరియు ఉద్రేకములతో నడుస్తున్నాననే విషయాన్ని ఎలా తెలుసుకొనగలను?” అని అడుగుతూ ఉంటారు. దీనికి జవాబు సహనములో దొరకుతుదని నేను నమ్ముతున్నాను.
ఉద్రేకములు మనల్ని ఇప్పుడే ఎదో ఒకటి చేయమని తొందరపడమని అర్దిస్తాయి! కానీ దేవుని జ్ఞానము దానిని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే విషయముపై మనకు స్పష్టమైన చిత్రమును చూచునట్లు ఆగమని చెప్తుంది. దేవుని జ్ఞానము మనము నిర్ణయము తీసుకొనక మునుపు జ్ఞానయుక్తమైన నడిపింపును మరియు ఆలోచనను వెదకమని చెప్తుంది.
మనము కొంత సేపు ఆగి దేవుని ఆలోచనతో మన పరిస్థితిను చూడవలెను. మనము ఎలా భావిస్తున్నామని కాకుండా మనకు ఏమి తెలుసనే విషయమును ఆధారముగా చేసుకొని మనము నిర్ణయములు తీసుకొనవలసియున్నది. మనము ఆయన జ్ఞానమును పొందుకొనవలెను మరియు దేవుడు మన జీవితములో ఉంచిన నమ్మకత్వము గల మనుష్యుల నుండి ఆలోచనను పొందుకొనవలెను.
మనము ఏ కష్ట నిర్ణయమును ఎదుర్కొనిననూ, మీరు బాధపడకుండునట్లు స్పష్టమైన జవాబు కొరకు వేచి యుండండి. ఉద్రేకములు అద్భుతములు, కానీ అవి జ్ఞానము మరియు వివేకమునకు ముందు నడచునట్లు అనుమతించకూడదు. దేవుని నడిపింపును వెదకుము మరియు మీరేమి చేయవలెనో మీకు తెలియజేయుటకు ఆయనను అనుమతించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నిర్ణయాలు తీసుకొనుటకు పరుగెత్తను మరియు నా ఉద్రేకములతో నడిపించబడను. నేను తీసుకునే నిర్ణయాల విషయంలో మీ జ్ఞానయుక్తమైన నడిపింపును వెదకాలని సమర్పించుకొనుచున్నాను.