
మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. —రోమా 8:39
వేధింపు అనగా, దుర్వినియోగం చేయడం, బాధించబడటం, హాని కలిగించడం వంటివి “దుర్వినియోగానికి అర్థం.” దుర్వినియోగ ప్రభావాలు దుష్ప్రభావం మరియు దీర్ఘకాలం ఉంటాయి. అనేక మంది దాని నుండి కోలుకోలేరు.
విభిన్నరకములైన వేధింపులు కలవు: లైంగిక, ఉద్రేకపరమైన, మాటలతో, భౌతికముగా విధించబడుట. ఎటువంటి రకమైనా కావచ్చు, ఫలితములు భయంకరమైనవి. అవి మీరు సరిగా పనిచేయనివ్వకుండా దేవుని ప్రేమను, నీతి సమాధానము మరియు దేవుని యందలి ఆనందమును పొందకుండ అడ్డుపడతాయి.
నేను దీనిని మొదటిగా అర్ధం చేసుకున్నాను ఎందుకంటే నేను నా బాల్యమంతా వేదించ బడ్డాను. కృతజ్ఞతా పూర్వకముగా నేను కేవలం వేధింపు యొక్క శక్తిని మాత్రమే తెలుసుకొనుట కాదు కానీ నేను దేవుని ప్రేమలోని గొప్ప శక్తిని గురించి తెలుసుకున్నాను. కేవలం దేవుని ప్రేమ వలన నా గతము నా భవిష్యత్తును ఏమాత్రము ప్రభావితము చేయలేదు. మీరు వేధించబడినట్లైతే దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నాడని అర్ధం చేసుకోండి. ఆయన ప్రేమ నుండి మిమ్మును ఏదియు వేరుపరచదు. మీరు మీ గతము నుండి విడిపించబడుటకు దేవుడు మీ కొరకు ఒక మార్గమును ఏర్పరచి యున్నాడు కాబట్టి మీరు దేవుడు మీ కొరకు ఏర్పరచిన ప్రణాళికలలో జీవించ గలరు.
యేసుతో జీవితములోని నూతనత్వమునకు నిరీక్షణ కలదు. ఆయన ప్రేమను నీవు ఈరోజు పొందు కుంటావా?
ప్రారంభ ప్రార్థన
దేవా, నా జీవితములో నీ ప్రణాళిక మరియు ఉద్దేశ్యముల నుండి నన్ను ఏదియు ఆటంకపరచుటకు నేను అనుమతించను. ఈరోజు మీ ప్రేమతో నన్ను కప్పండి తద్వారా నేను వేదింపుల నుండి నీ స్వస్థతను మరియు స్వేచ్చను పొందుకుంటాను.