
తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, … – ఎఫెసీ 1: 5
మనము ఉన్నట్లుగానే పరిపూర్ణులము కానప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే అది ఆయనకు ఇష్టం గనుక – ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంత పాపభరితమైనవైనప్పటికీ మనలను ప్రేమించుట ఆయన స్వభావమై యున్నది.
దేవుడు చెడును మంచితో జయిస్తాడు (రోమీయులకు 12:21 చూడండి). మన పాపము కన్నా, ఆయన కృప చాలా గొప్పది కాబట్టి ఆయన మనమీద నిరంతరం కృపను ఉంచుతాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోవటం అసాధ్యం కనుక మనల్ని ప్రేమించకుండా ఉండటానికి ఏదియు చేయలేము.
ప్రేమించుట దేవుని స్వభావమై యున్నది. ఆయన ప్రేమయై యున్నాడు (1 యోహాను 4:8 చూడండి). మనం ఎల్లప్పుడూ చేసే పనులను ఆయన ప్రేమించక పోవచ్చు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ, మన పాపాలను క్షమిస్తుంది, మన భావోద్వేగ గాయాలను నయం చేస్తూ, మన విరిగిన హృదయాలను మాన్పుతుంది (కీర్తనలు 147:3 చూడండి).
దేవుని ప్రేమ నిబంధనలు లేనిది; ఇది ఆయన మీద ఆధారపడింది, మన మీద కాదు! ఒకసారి మీరు ఏమి చేశారో లేదా చేయలేదని కాక దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, మీరు అద్భుతమైన పురోగతిని అనుభవించవచ్చు. మీరు ఆయన ప్రేమను సంపాదించడానికి ప్రయత్నించుట ఆపి, దానిని స్వీకరించండి మరియు దాన్ని ఆస్వాదించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ ప్రేమ అద్భుతమైనదిగా ఉంది. నీ ప్రేమపై దృష్టి ఉంచుట అనునది అది మీ మంచితనం మీద ఆధారపడి ఉంటుందని నాకు జ్ఞాపకం చేస్తుంది, కానీ నా చర్యలపై కాదు. నేను మీ ప్రేమను పొందడానికి నాకు సహాయం చేయండి.