“ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.” – రోమా 5:5
దేవుని నిబంధనలేని ప్రేమతో మానవులు ఇతరులను ప్రేమించుట అసాధ్యము. కానీ మనము క్రీస్తులో విశ్వాసులముగా మనలో దేవుని ప్రేమ యున్నది. మనలో ఆ ప్రేమను నిబంధనలు లేకుండా ప్రవహించునట్లు అనుమతించగలము. మన ప్రేమ విఫలమవ్వవచ్చు, కానీ దేవుని ప్రేమ విఫలమవ్వదు. మన ప్రేమ ముగించబడవచ్చు కానీ దేవుని ప్రేమకు అంతము లేదు.
కొన్నిసార్లు మనము మన స్వంత శక్తి ద్వారా నేను ఒక వ్యక్తిని ప్రేమించ లేక పోయినప్పటికీ, నేను దేవుని ప్రేమ ద్వారా సామర్ధ్యము కలిగియున్నాను. నిజమైన దేవుని ప్రేమ భావనల మీద ఆధారపడి యుండదు – అది నిర్ణయము మీద ఆధారపడి యుంటుంది. అది ఆ వ్యక్తి అర్హుడా కదా అనే విషయంపై ఆధారపడి యుండదు. వారు అర్హులా అనే విషయాన్ని అడగడం ఆపకుండా ప్రజలను పూర్తిగా ప్రేమించ గలగడమనే దాని మీద పూర్తిగా ఆధారపడి యుంటుంది.
మానవ ప్రేమ భావనల మీద ఆధారపడి యుంటుంది. వారు మనలను మొదటిగా ప్రేమిస్తే లేక వారు మనతో ప్రేమగా ఉంటె అది ప్రజలను ప్రేమిస్తుంది. అటువంటి ప్రేమ వస్తుంది మరియు పోతుంది.
దేవుని ప్రేమ పూర్తిగా విభిన్నమైనది. దేవుడు తప్ప మరి దేని మీద ఇది ఆధారపడి యుండలేదు. మన క్రీస్తును మన స్వంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో పొంగి పొర్లును గాక. ఈరోజే దేవుని ప్రేమను ఇతరులపై కుమ్మరించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా ప్రేమ తరిగి పోవచ్చు కానీ మీ ప్రేమ మాత్రం ఎన్నడూ తరగదు. నేను మిమ్మును మీ మితిలేని ప్రేమ నుండి నేను ప్రేమను తోడుకున్నట్లైతే నేను దానిని ఇతరులు దానికి యోగ్యులా కాదా అనే విషయంతో పని లేకుండా వారికి పంచ గలను.