
అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసు కృపచేత మీరు రక్షింపబడియున్నారు. —ఎఫెసీ 2:4-5
కొన్నిసార్లు జీవితం నిరుత్సాహముతో నిండి యున్నప్పుడు, మనము చేయగలిగిన ఉత్తమ విషయం ఎదనగా దేవుని ప్రేమ యొక్క స్వభావమును జ్ఞాపకం చేసుకొనుట.
బైబిల్ మనకు చెప్పే అందమైన విషయాల్లో ఒకటి ఏదనగా మనము ఇంకనూ పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను (రోమా 5:8 చుడండి). ఆయన ప్రేమకు మనము అర్హులమయ్యేంత వరకు వేచియుండలేదు. ఆయన మనలను నిబంధనలు లేకుండా ప్రేమించి యున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే, మన జీవితములో సమస్తమును సంపాదించుకోవాలని ఆశించుటకు అలవాటుపడి యున్నాము కాబట్టి మనలో అనేకమందికి అర్ధం చేసుకొనుట చాలా కష్టంగా ఉంది.
ఆయన మన కొరకు కలిగియున్న గొప్ప మరియు బలమైన ప్రేమను బట్టి, దేవుడు మనకొరకు తన జీవితమును ఉచితముగా ధార పోశాడు. అది విప్లవాత్మక ప్రేమ – నిజమైనది, విప్లవాత్మక ప్రేమ అనునది తనను తాను అర్పించుకుంటుంది ఎందుకనగా దాని కంటే తక్కువ ఏది చేసిన సంతృప్తి పడదు.
దేవుని నిబందనలేని ప్రేమయే మనలను ఆయన వైపుకు నడిపిస్తుంది, ఆయన అద్భుత ప్రేమ మన పాపములను తుడిచి పెడుతుంది, మరియు ఆయన శక్తివంతమైన త్యాగము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుటకు మార్గము చూపుతుంది. ఆయన ప్రేమ ఎన్నడూ విడిచి వెళ్ళదు, వదిలివేయదు మరియు ఎన్నడూ వీడదు. నీవేప్పుడైనా నిరాశ పడినప్పుడు, దేవుడు మీ కొరకు కలిగియున్న గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకొనుము.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ ప్రేమ నన్ను ఆనందపరచింది. దానిని నేను ఆశించక పోయినా మీ ప్రేమ ఎన్నడూ విడువదని నాకు తెలుసు. మీ సమస్తమును నాకు అనుగ్రహించి యున్నారు, మరియు ఒక సందేహము యొక్క నీడను దాటి నీవు నన్ను ప్రేమించు చున్నావని నాకు తెలుసు.