
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్తనలు 119:11)
నేను ఒకసారి ఒక పుస్తకం మీద ఏదైనా వ్రాయుటకు కూర్చున్నాను మరియు ఆ సమయంలో దేవుడు నాతో “కొద్ది నిమిషాలు వేచియుండండి అని మాట్లాడుట నేను గ్రహించాను, నేను కొద్ది సమయం వేచి ఉండి ఆ తరువాత పోన్ చేయడం ప్రారంభించాను. ప్రభువు మెల్లగా, “నేను నీకు ఫోన్ చేయమని చెప్పలేదు; నా కోసం వేచి ఉండమని చెప్పాను.” ఏదైనా చేయాలనే నా కోరిక అసాధారణమైనది కాదు; చాలా మంది వ్యక్తులు వేచి యుండుట ఉండటం మరియు ఎవరికోసమైనా, దేనికోసమైనా లేదా దేవుని కోసమైనా ఎదురుచూడటం చాలా కష్టం.
నేను నిశ్శబ్దంగా ఉండి కొంత సమయం వరకు వేచి ఉన్న తర్వాత, దేవదూతల గురించి ప్రభువు నాతో మాట్లాడటం ప్రారంభించాడు-అది నేను ఖచ్చితంగా ఊహించనిది. ఆయన నన్ను అనేక లేఖనాలను వెదకునట్లు నడిపించాడు మరియు నేను దేవదూతల శక్తి మరియు సన్నిధిలో చిన్న-బైబిల్ అధ్యయనాన్ని ముగించాను. దేవుడు చేసే ప్రతిదానికీ కారణాలు ఉన్నాయి, మరియు నా తరపున పనిచేసే దేవదూతల గురించి నేను మరింత తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను-నేను చాలా కాలంగా దీని గురించి ఆలోచించలేదు.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మరియు దేవదూతల విషయమంతా నేను నా స్వంత మనస్సులో ఆలోచించినది కాదని నాకు ఖచ్చితంగా ఎలా తెలిసిందని మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను ఏదైతే విన్ననో అందులో నాకు సమాధానము ఉంది. ఇది నా అంతరంగములో “యధార్ధమైనదని” అనిపించింది. నా ఆత్మ దానిని ప్రభువు నుండి వచ్చిన సందేశంగా ధృవీకరించింది మరియు నేను విన్న మాట దేవుని వాక్యంతో ఏకీభవించబడింది.
నేను దేవుని కోసం ఎదురుచూసి, ఇలాంటి స్వరాన్ని విన్నాను, కానీ అది దేవునిది కాదని అకారణంగా తెలుసుకున్నాను. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడో మరియు ఎప్పుడు మాట్లాడలేదో సురక్షితంగా తెలుసుకోవాలంటే మనం ఆయన వాక్యం ద్వారా దేవుని గురించి తెలుసుకోవాలి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు దేవుని స్వరము గుర్తించునట్లు దేవుని వాక్యమును అధ్యయనం చేయండి.