యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. (కీర్తనలు 86:11)
మనం దేవుని స్వరాన్ని విని, దేవుని మార్గంలో జీవించినట్లయితే, మనం ఆయనను సేవించాలని ఎంచుకుంటే, మనం ఆయనతో సుదీర్ఘ కుస్తీ పోటీలను నివారించవచ్చు. దేవుడు కోరుకున్నది మనతో చేయనివ్వమని జ్ఞానం చెబుతుంది, కాబట్టి మనం ఎల్లప్పుడూ ఒకే “కొండ” చుట్టూ తిరుగుతూ ఉండము (ద్వితీయోపదేశకాండము 2:3 చూడండి). ఇరవై ముప్పై ఏళ్లుగా అవే అడ్డంకులు, సమస్యలతో సతమతమవుతున్న వారిని కలిశాను. వారు మొదట్లో దేవునికి విధేయత చూపినట్లయితే, వారు చాలా కాలం క్రితం తమ జీవితాలను కొనసాగించేవారు.
దేవునికి మనము దొరికినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఎంత ఆనందించినా, ఆయన అక్కడ ఉండనివ్వడు మరియు స్తబ్దుగా ఉండనివ్వడు. ఆయన మనల్ని తీసుకెళ్లడానికి కొత్త ప్రదేశాలను మరియు మనకు నేర్పడానికి కొత్త పాఠాలను కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని పూర్తిగా జీవంతో, ఎదుగుదలతో నింపి, తన ఉద్దేశాలు మరియు ప్రణాళికలతో నింపాలని కోరుకుంటున్నాడు.
దేవుడు మనతో ఇలా చెప్తున్నాడు, “మీరు నా మాట వినని యెడల, నన్ను అలక్ష్యము చేసిన యెడల, నా బోధకు మీరు చెవియొగ్గని యెడల నేను మీ విషయములో ఏడ్చుదును. నేను మీకు సహాయము చేయుటకు ప్రయత్నిస్తాను, కానీ మీరు నా మాటకు చెవి యొగ్గని యెడల, మీరు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మీరు దు:ఖముతో నా వద్దకు వచ్చెదరు.” (సామెతలు 1:24–28 చూడండి).
దేవుడు కనికరము గలవాడు మరియు ధీర్ఘశాంతము గలవాడు, కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు మనము ఆయన విధేయత చూపవలసినదని గుర్తిస్తాము. మనము ఎంత త్వరగా విధేయత కలిగి దేవుని మార్గములో నడచుట ప్రారంభిస్తామో, అంత త్వరగా, మనం మన జీవితాలను కొనసాగించవచ్చు మరియు దేవుని మంచి ప్రణాళికలలో ముందుకు సాగవచ్చు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ప్రార్ధించండి విధేయత చూపించండి మరియు ఆలస్యము చేయకండి.