
యెహోవాయందు నమ్మికయుంచి (ఆధారపడి, ఆనుకొని మరియు విశ్వాసము కలిగి) మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము. —కీర్తనలు 37:3
మనలో చాలా మంది మనకు మనం ఎలా ఆశీర్వాదం పొందవచ్చో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడుపుతారు. ప్రజలు కొన్నిసార్లు తమ జీవితాంతం ఏదైతే వారు ముఖ్యమని భావిస్తారో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు, వారు ఎప్పుడూ దేవుని యందు విశ్వాసముంచరు లేదా ఆయనను నడిపించనివ్వరు. చివరికి, ఇది వారిని నిరుత్సాహపరుస్తుంది మరియు నెరవేర్చబడకుండా మిగిలిపోతుంది.
కీర్తన 37: 3, “యెహోవా యందు నమ్మిక యుంచి …. మేలు చేయుము” అని చెప్తుంది. దేవుడు మనల్ని స్వార్థపరులుగా సృష్టించలేదు లేదా అన్ని సమయాలలో మనకు మనమే సహాయం చేయడంపై దృష్టి పెట్టలేదు. ఇతరులకు సహాయపడటం ద్వారా మనం మంచి విత్తనాన్ని విత్తాలని ఆయన కోరుకుంటాడు. మరియు మంచి చేయడం గొప్ప సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించడానికి ఇది తలుపులు తెరుస్తుంది.
మీ జీవితంలో సరైన ఆశీర్వాదాలను తీసుకురావడానికి దేవునిని నమ్మండి. మీరు ఆయన ఖచ్చితమైన సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఇతరులకు సహాయం చేయడంలో తీరిక లేకుండా ఉండండి. మీరు మీ గురించి ఎప్పటికప్పుడు ఆలోచించనప్పుడు మీకు నిజంగా ఉపశమనం కలుగుతుంది.
మీకు తెలిసిన మంచి పనులను చేయడంలో మీరు బిజీగా ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని నమ్మకంగా ఆశీర్వదిస్తాడు మరియు మీ అవసరాలను తీర్చగలడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను స్వార్ధపూరితమైన, స్వీయ కేంద్రిత జీవితమును జీవించాలని నేను ఆశించుట లేదు. నేను ప్రేమించుటకు నా వద్దకు పంపబడిన వారి కొరకు మేలు చేయుచు సహాయపడుతు ఉండగా మీరు నా జీవితములోనికి సరియైన ఆశీర్వాదములను పంపగలరని నేను నీ యందు నమ్మిక యుంచి యున్నాను.