నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. —సామెతలు 4:21-22
బైబిల్ ఒక సాధారణమైన పుస్తకం కాదు. ఆ పేజీలలో ఉన్న మాటలు మన ప్రాణమునకు మందు లాంటివి. వాక్యములో జీవమున్నది కనుక మీ జీవితమును మార్చే శక్తిని అది కలిగి యున్నది!
మీరు దేవుని వాక్యములోని సత్యమును మరియు శక్తిని కనుగొన్నట్లైతే, ఈ సత్యము మాత్రమే మీకు అందించ గలిగిన మీ జీవితములో మార్పులను చూడగలరు. మీకు వ్యతిరేకముగా శత్రువు తీసుకొని వస్తున్న అబద్ధములను గుర్తించుటను కుడా మీరు నేర్చు కొనగలరు.
మీరు కేవలం బైబిల్ ను చదువుట ప్రారంభించుట లేక దాని ద్వారా పిరికి గా మారినట్లయితే మీరు దానంతటినీ ఒకేసారి చదువుతూ సమస్తమును ఒకేసారి అర్ధం చేసుకోవాలని అనుకోవద్దు. మీతో మీరు సహనముగా ఉండండి. ప్రాముఖ్యమైన విషయమేదనగా మీరు ఎక్కడైనా ప్రారంభించి దాని దగ్గరే ఉండుటకు నిర్ణయించుకోండి. ఎందుకంటే మీరు బైబిల్ చదివే ప్రతిసారి మీరు చదివే వాక్యము మీద మీరు నేర్చుకునే దాని మీద ధ్యాసనుంచండి.
సామెతలు 4:20 ఇలా చెప్తుంది, నా కుమారుడా, నా మాటలు ఆలకించుము… కేవలం చదువుట ధ్యానముంచుట ప్రాముఖ్యమైనది – దీని అర్ధమేమనగా లేఖనములను ధ్యానించుచు దానిని మీ మనస్సులో పదే పదే ధ్యానించండి.
మనము దేవుని వాక్యమును చదువుతూ ధ్యానించుటకు మరియు పైన ఇవ్వబడిన వాటన్నిటి కంటే దానితో సమ్మతించుటకు మనము సమయం గడుపుతుండగా మనము జీవముతో మరియు దేవుని స్వస్థతా శక్తితో నింపబడు తున్నాము.
ప్రారంభ ప్రార్థన
దేవా, జీవమునిచ్చే శక్తిని కలిగియున్న నీ వాక్యమును బట్టి నీకు వందనములు! నేను దానిని చదువుతూ అధ్యయనం చేయుచుండగా, నేను దేనిని నేర్చుకోవాలో దానిని నాకు బోధించుము మరియు నీ స్వస్థత శక్తిని నా జీవితములోనికి ప్రవహింప జేయుము.