
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. —కీర్తనలు 107:20
వాస్తవానికి అనేక మంది స్వస్థతలో నమ్మకమునకు ప్రత్యామ్నాయంగా దేవుని ఔషధమనే – ఆయన వాక్యమును తీసుకొని పొరపాటు చేస్తారు. వారు వాక్యమును ఉపయోగించకుండా లేక అన్వయించకుండా “నేను స్వస్థతను నమ్ముతాను” అని చెప్తారు. మనము మందులు తీసుకోకుండా అవి మంచివి అని ఎలా చెప్తాము?
దేవుని వాక్యము ఒక మందు – అది స్వస్థతకు సాధారణ మందు ఎలా పని చేస్తుందో అలాగే దేవుని వాక్యము కూడా ఒక స్వస్థత కారకము. మరో మాటలో చెప్పాలంటే – ఔషధములోనే స్వస్థతను ఉత్పత్తి చేసే సామర్ధ్యము ఉంటుంది. మీ శరీరానికి వైద్యం తెచ్చే శక్తి, జీవము, సామర్థ్యం మరియు స్వభావం దేవుని వాక్యంలో అంతర్లీనంగా ఉన్నాయి.
కాబట్టి మీరు దీనిని ఎలా తీసుకుంటారు? అది కేవలం దేవుని వాక్యము మీ హృదయములో వేరుపారినప్పుడు మరియు నిలిచియున్నప్పుడు అది మీ శరీరములో స్వస్థతను ఉత్పత్తి చేస్తుంది. కేవలం మీ తలలో జ్ఞానము దీనిని చేయదు. లేఖనములు మీ శరీరములో స్వస్థతను ఉత్పత్తి చేయుటకు ధ్యానము – అనగా వాటిని చదువుట, వినుట మరియు వాటిని మీ మనస్సులో పదే పదే మననం చేసుకొనుట ద్వారా మీ మనస్సులోగుండా చొచ్చుకొని పోవలెను. ఒక్కసారి వాక్యము నిజముగా మీ హృదయములోనికి చొచ్చుకొని పోయినట్లయితే అది మీ శరీరమంతటికీ ఆరోగ్యమును ఇస్తుంది. ఈరోజే దేవుని వాక్యము మీ హృదయములోనికి లోతుగా వెళ్ళును గాక!
ప్రారంభ ప్రార్థన
దేవా, ఈరోజు నేను నీ స్వస్థత మాటను ధ్యానించాలని ఎన్నుకున్నాను. మీ వాక్యమును నా హృదయములో లోతుగా ఉంచుకొనుట ద్వారా మీ స్వస్థత నా శరీరమును నింపుతుందని నేను ఎరిగియున్నాను.