దేవుని సమయమును అంగీకరించుట

దేవుని సమయమును అంగీకరించుట

… ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.  —నిర్గమ కాండము 13:17-18

దేవుడు మన జీవితములలో కొన్ని విషయాలు జరుగుటకు దేవుడు మనకు నిరీక్షణను అనుగ్రహిస్తారు కానీ ఆయన ప్రణాళికలోని ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకొనునట్లు ఆయన అనుమతించడు. ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోలేక వారు ఎంతో విసుగు చెందియుండే వారు.  మనము దేవుని సమయాన్ని అంగీకరించినప్పుడు, మనము నిరీక్షణ మరియు ఆనందములో జీవించుట నేర్చుకొని దేవుడు మన సమస్యలలో పని చేయుచుండగా మనము ఆనందించగలము.

నిర్గమకాండము 13:17-18 మనకు తెలియజేయునదేమనగా దేవుడు ఇశ్రాయేలీయులను వారి వాగ్ధాన దేశమునకు వెళ్ళు మార్గములో ఎంతో దూరము మరియు కష్టముల గుండా నడిపించి యున్నాడు, ఎందుకనగా అందులో నడచుటకు వారు సిద్ధంగా లేరని ఆయనకు తెలుసు. వారు తమ తర్ఫీదు సమయంలో అక్కడ ఉండవలసి యున్నది మరియు వారు కొంత పరీక్షా సమయం గుండా వెళ్ళవలసియున్నది. ఈ ప్రక్రియలో, దేవుడు వారిని గురించి శ్రద్ధ తీసుకొనుటలో ఆయన తప్పిపోలేదు మరియు వారేమి చేయాలని దేవుడు ఆశించాడో దానిని వారికి చూపించి యున్నాడు.

అదే మన జీవితములలో నిజమై యున్నది…. దేవుని తర్ఫీదు కాలములో కేవలము దేవుడు మనలను చేయమని చెప్పిన దానిని ప్రశ్నించకుండా అన్నిటిని తెలుసుకొనుటకు ప్రయత్నించకుండా చేయుటయే. దీనిని చేయుటకు ఎంత సమయం తీసుకున్నా మనము దేవుని సమయమును అంగీకరిచుటను ఎంతో ఆత్మ విశ్వాసముతో తెలుసుకొనుట.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీ సమయమును నేను అంగీకరిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ అర్ధం చేసుకోలేక పోవచ్చు, కానీ మీ మార్గములు పరిపూర్ణములు మరియు నేను పూర్తిగా నిన్ను నమ్ముతున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon