
దేవా, నన్ను (బాగుగా) పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము! —కీర్తనలు 139:23
అనేక సంవత్సరముల క్రితము మేము ఆర్దికముగా నలిగిపోయి యున్నప్పుడు, నేను దేవుని ఎదుట గొప్ప మార్పు కొరకు మరియు నమ్మిక కలిగి యుండుటలో చాల విసిగిపోయి క్రుంగిపోయి యున్నాను దాని కొరకు కొంత సమయం రోదించి దేవుని కృప వలన దేవుని ఎదుట ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రకటించి యున్నాను “దేవా, నేను మరణించేంత వరకు నేను ఎటువంటి ప్రతి ఫలమును చూడక పోయినా దశమ భాగము మరియు కానుకలను సమర్పిస్తాను!”
నేను ఇలా ఎందుకు ఇస్తున్నాను అనేది నా హృదయ పూర్వకముగా నాకు పరీక్షయై యున్నది. నేను సరియైన దైవిక ఉద్దేశ్యములను కలిగి యున్ననా లేదా అని నాకు బయలు పరచమని కోరుకున్నాను. నేను కేవలం పొందుకొనుటకే ఇస్తున్నట్లైతే నేను కేవలం దేవుని నుండి స్వార్ధముగా పొందుకొనుటకే ఇస్తున్నాను.
“మీరు దీనిని చేయండి, దీనిని పొందుకుంటారు” అనే అనేక రకాలైన బోధనలు చేస్తున్నారు. కానీ శుద్ధమైన హృదయము, “కేవలం ఇది సరియైనది మరియు ఇది దేవునిని మహిమ పరుస్తుందని నేను దీనిని చేయుచున్నాను” అని చెప్పినట్లయితే దీని సంగతి ఏమిటి?
మీరు నిజాయితీగా ఈరోజు మీ ఉద్దేశ్యములను పరీక్షించుకొనుమని మరియు అవి స్వార్ధపూరితమైనవి కాకుండా చుచుకొనుమని మిమ్మును అర్ధిస్తున్నాను. మీరు సరియైన కారణముల కొరకు దేవునిని సేవించవలేనని హృదయపూర్వక సమర్పణ చేయండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, ఈరోజు నా హృదయమును పరిశోధించి, నా నిజమైన ఉద్దేశ్యములను తెలుసుకొనుము. ఒకవేళ అవి ఏ పరిస్థితిలోనైనా దైవికమైనవి కాని యెడల వాటిని నాకు చూపించండి మరియు మార్పు చెందుటకు నాకు సహాయం చేయండి.