
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. —హెబ్రీ 4:16
మనము దేవుని కృప (అసాధారణ అంతరంగ శక్తి) కొరకు ఆయన వద్దకు పరుగెత్తే అలవాటును కలిగి యుండాలని ఆశిస్తున్నాడు. మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడవలెనని ఆశిస్తున్నాడు.
కానీ శత్రువు మనతో అబద్ధము చెప్పుటకు ప్రయత్నిస్తూ, మనము దేవుని సన్నిధిలో ఉండుటకు చాలినంత మంచి వారము కామని చెప్తాడు. మనకు దేవుడు ఏదైనా సహాయం చేయుటకు అడ్డంకిగా మనము అనేక తప్పులు చేసామని మనతో ఒప్పించుటకు ప్రయత్నిస్తాడు.
కానీ దేవుని వాక్యము దానిని చెప్పుట లేదు. ఆయన వాక్యము చెప్పునదేమనగా విమోచించబడిన ఆయన పిల్లలముగా, మనము ధైర్యముగా ఆయన సింహానము నోద్దకు చేరగలము. మనము ఈరోజు ఆయన సత్యమును పొందుకొని దానిలో జీవించుటకు ఎంపిక చేసుకోనగలము.
“దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను భావించుటలేదు,” “నేను క్షమించబడ్డానని నేను అనుకొనుటలేదు” లేక “నాకు భవిష్యత్తు ఉందని నేను అనుకోవడం లేదు” అని పలుకుట కంటే “దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు మరియు ఆయన ప్రేమ నుండి నన్ను ఏదియు వేరుపరచలేదు. ఆయన నన్ను క్షమించాడు కాబట్టి ఆయన నన్ను అంగీకరిస్తాడని నేను ఆయన వద్దకు ధైర్యముగా వెళ్ళగలను” అని చెప్పాలి.
మీరు అయోగ్యులని భావించిన ప్రతిసారీ, దేవుని వాక్యము ఏమి చెప్తుందో దానిని జ్ఞాపకం ఉంచుకోండి మరియు మీ పరలోకపు తండ్రి యొద్దకు ధైర్యముగా వెళ్ళండి. ఆయన మిమ్ములను అంగీకరించుటకు వేచియున్నాడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను క్షమించబడ్డానని మీ వాక్యము సెలవిస్తుంది కనుక నేనెల్లప్పుడు మీ వద్దకు రాగలను. నా విఫలముల కొరకై మీ క్షమాపణను బట్టి వందనములు మరియు అవసర సమయములో మీ కృప నాకు సహాయం చేయును.