
నాయందు విశ్వాసముంచు (నా మీద ఆధారపడు) వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు (విడువక) పారునని బిగ్గరగా చెప్పెను. —యోహాను 7:38
క్రీస్తులో విశ్వాసులుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించును, మన ఆత్మల్లో నిలిచి యుండును. ఆయన మనలో ఉండే జీవజలపు ఊటయై యున్నాడు. ఈ నది మనలో ప్రతి ఒక్కరిలో దేవుడిచ్చిన అద్భుతమైన బహుమనమై యున్నది. అది మంచి ఆరోగ్యముతో జీవితముతో సానుకూల దృక్పధముతో ఉదారముగా మరియు క్షమించే వైఖరితో ప్రవహిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, అనేకమంది ప్రజలు, వారి నదులను ఆగిపోయేటట్లు చేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ నిరుత్సాహముతో ఉంటారు మరియు వారేమి చేసినా దాని నుండి ఏదియు పొందలేరు. అలక్ష్యము చేసిన సంవత్సరములు ఒక్కసారిగా శక్తివంతముగా ప్రవహించే నది చిన్న కాలువగా మారుతుంది. ఇటువంటి ప్రజలను గురించి మీకు తెలుసా? ఇది మీ జీవితము వలె కనపడుతుందా?
మీరు మీ నదిని పూర్తిగా అడ్డంకులను తొలగించునంత వరకు ప్రతిదీ కష్టముగా, నిరుత్సాహముగా మరియు నెరవేర్పు లేకుండా ఉండును. మీరు వేరే ఎటువంటి సంతృప్తి నిచ్చే నీటిని రుచి చూడలేరు.
మీ జీవితములోని ప్రతి అడుగులో పోరాటముతో, యుద్ధముతో మరియు మట్టితో నిండి అడ్డంకులతో గడపకుండా ఆపుటకు ఒక నిర్ణయము తీసుకోండి. మీ అడ్డంకులను దేవుడు తీసివేయునట్లు దేవునిని అడగండి. ప్రవాహమును ఏదైతే ఆపుతుందో దానిని ఎలా జయించాలో ఆయన మీకు చూపిస్తాడు. అప్పుడు, జీవజల నదుల తృప్తికరమైన ప్రవాహములో ఆనందించండి!
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ జీవజల నదులు నాలో పొర్లి పారునట్లు ఆశిస్తున్నాను. మార్గమునకు అడ్డుగా వస్తున్న ఆటంకమును నాకు చూపించండి మరియు దానిని ఎలా తీసి వేయాలో కూడా చూపించండి.